స్టార్ హీరో కొడుక్కి చిన్ననాటి స్నేహితుడి పేరు
ఈ సందర్భంగా ప్రచార ఇంటర్వ్యూలలో సేతుపతి పలు ఆసక్తికర విషయాలను ముచ్చటిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత, కుటుంబ విషయాలను అతడు బయటపెడుతున్నారు.
భారతదేశంలోని అత్యుత్తమ నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. అతడికి పాన్ ఇండియాలో గొప్ప పేరు, గుర్తింపు ఉన్నాయి. కెరీర్ లో ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలతో అందనంత ఎత్తుకి ఎదిగాడు. సేతుపతి నటించిన 'విడుతలై పార్ట్ 2' డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రచార ఇంటర్వ్యూలలో సేతుపతి పలు ఆసక్తికర విషయాలను ముచ్చటిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత, కుటుంబ విషయాలను అతడు బయటపెడుతున్నారు.
విజయ్ సేతుపతి తాజా చాటింగ్ సెషన్‌లో తన కొడుకు పేరు వెనుక ఉన్న కారణాన్ని తెలిపారు. చిన్ననాటి స్నేహితురాడిని కోల్పోయాక అనుకోకుండానే తన కుమారుడికి అతడి పేరు(సూర్య) పెట్టినట్లు సేతుపతి తెలిపారు. దివంగతుడైన తన స్నేహితుడికి ఇది ఘనమైన నివాళి.. తన ప్రియతమ స్నేహితుడి జ్ఞాపకాలను ఈ విధంగా గౌరవించాలనుకున్నాడు.
విజయ్ తన స్నేహితురాలైన జెస్సీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి సంబంధం ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 2003లో అతడు జెస్సీని వివాహం చేసుకోవడానికి విజయ్ సేతుపతి భారతదేశానికి తిరిగి వచ్చాడు. విజయ్ - జెస్సీకి ఇద్దరు పిల్లలు. సూర్య అనే కుమారుడు, శ్రీజ అనే కుమార్తె ఉన్నారు.
నయనతార- సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'నానుమ్ రౌడీ ధాన్' చిత్రంలో చిన్ననాటి పాత్రను పోషించడం ద్వారా యువకుడైన సూర్య నటనలోకి అడుగుపెట్టాడు. సింధుబాద్ చిత్రంలో విజయ్‌తో కలిసి కనిపించాడు. ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించిన 'ఫీనిక్స్' చిత్రంతో సూర్య సేతుపతి కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు.