గీతా పిలిచినా.. మెగాస్టార్ నో అంటున్నాడా..?

చిరంజీవికి గీతా ఆర్ట్స్ కి ఉన్న బంధం అలాంటిది. ఐతే చిరు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క సినిమా కూడా ఆ బ్యానర్ లో చేయలేదు.

Update: 2024-12-28 02:30 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఎక్కువగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటాయి. ఎవరైనా డైరెక్టర్ వచ్చి కథ చెబితే ఓకే అనిపిస్తే చాలు గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే వారు. అల్లు అరవింద్ కూడా తన బ్యానర్ లో చిరు సినిమా అంటే చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యే వారు. చిరంజీవి సినిమాల వల్లే గీతా ఆర్ట్స్ అంటే మెగా బ్యానర్ అనే ముద్ర పడింది. చిరంజీవికి గీతా ఆర్ట్స్ కి ఉన్న బంధం అలాంటిది. ఐతే చిరు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క సినిమా కూడా ఆ బ్యానర్ లో చేయలేదు.

చిరంజీవి రీ ఎంట్రీ టైం లో కొణిదెల ప్రొడక్షన్స్ అని ఒక బ్యానర్ స్థాపించి అందులోనే సినిమాలు చేశారు. అదొక్కటే కాదు చిరు చేసిన వరుస నాలుగు సినిమాలు అందులోనే తెరకెక్కించారు. భోళా శంకర్ ఒక్కటి ఏ.ఎక్ ఎంటర్టైన్మెంట్స్ లో అనీల్ సుంకర నిర్మించారు. ఐతే చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఎందుకు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయలేదు అన్నది సమాధానం లేని ప్రశ్న అయ్యింది. ఐతే గీతా ఆర్ట్స్ అటు అల్లు అర్జున్ సినిమాలకు కొలాబరేట్ అవుతూ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు మీడియం రేంజ్ సినిమాలు తీస్తూ వస్తున్నారు.

గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా తీయకపోవడానికి రీజన్స్ అంటూ ప్రత్యేకం ఏమి లేకపోయినా మెగా బ్యానర్ గీతాలో చిరంజీవి సినిమా అంటే ఆ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉంటాయి అందుకే అది కుదరకనే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్నా అల్లు అరవింద్ సినిమా చేయలేదని చెప్పొచ్చు. ఐతే గీతా ఆర్ట్స్ లో చిరంజీవి సినిమా తీస్తే పక్కా మరో సంచలన సినిమా అవ్వాలనే ఆలోచనతోనే వాళ్లు వెనక్కి తగ్గుతున్నారని చెప్పుకుంటున్నారు.

ఐతే అల్లు అరవింద్, మెగా ఫ్యామిలీల మధ్య ఎక్కడో డిస్టెన్స్ ఉందని అందుకే చిరుతో అల్లు అరవింద్ సినిమాలు చేయట్లేదన్న వాదన కూడా ఉంది. కానీ తామంతా ఒక్కటే అని ఎప్పటికప్పుడు ఆ ఫ్యామిలీస్ ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. నిర్మాతగా అల్లు అరవింద్ ఇప్పుడు అంత ఫోకస్ గా లేరన్నట్టు తెలుస్తుంది. అందుకే బన్నీ వాసు తో మీడియం రేంజ్ సినిమాలను లాగిస్తున్నారు. చిరంజీవితో సినిమా చేసే కథ వస్తే అల్లు అరవింద్ మళ్లీ రంగంలోకి దిగుతారని తెలుస్తుంది. మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News