చిరు-అనిల్ స్క్రిప్ట్ లాక్.. మరోసారి 'శంకర వరప్రసాద్'
మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా పట్ల అభిమానుల అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.;

మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా పట్ల అభిమానుల అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మాస్, ఫన్ మాస్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అనిల్ రావిపూడి స్వయంగా ఈ వివరాలను షేర్ చేయడం విశేషం. ఫైనల్ గా ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ పూర్తి అయ్యింది. మెగాస్టార్ ను ఒప్పించడం అంటే మాములు విషయం కాదు. ఆయన ఎంతో కొంత సమయం తీసుకుంటారు. కానీ అనిల్ కథను జెట్ స్పీడ్ లో ఒకే చేశారు అంటే కంటెంట్ బలంగా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది.

చిరంజీవి గారికి స్వయంగా కథ చెప్పిన అనిల్, ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. “చిరంజీవి గారికి నా కథలో పాత్ర ‘శంకర్ వరప్రసాద్’ ని పరిచయం చేశాను. ఆయన ప్రేమగా స్వీకరించారు, ఆసక్తిగా ఆస్వాదించారు. ఇంకెందుకు లేటు. త్వరలో ముహూర్తంతో చిరు నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం.. అంటూ అనిల్ ట్వీట్ చేశారు.
‘చిరు అనిల్’ ప్రాజెక్ట్ పేరుతో సోషల్ మీడియాలో ఇప్పటికే భారీగా ట్రెండ్ అవుతోన్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ అయ్యినట్టు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. ఈ సినిమా లో చిరంజీవి అసలు పేరు ‘శంకర వర ప్రసాద్’ పేరును బాగానే హైలెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో శంకర్ దాదా MBBS లో కూడా ఆ పేరుతోనే హైలెట్ అయ్యారు. ఇక చిరంజీవి మాస్, ఫన్ గేర్‌లోకి తిరిగి వస్తున్న సినిమానే అనిపిస్తుంది. అనిల్ మార్క్ కామెడీ, మెగా మేనరిజమ్ కలిస్తే తెరపై పండే ఎంటర్టైన్‌మెంట్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఎక్కువవుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో కన్ఫామ్ అయ్యాడన్న వార్తల నేపథ్యంలో, మ్యూజిక్ వర్క్ ఓ స్థాయిలో ముందుకు వెళ్లిపోయింది. నాలుగు పాటలు ఇప్పటికే కంపోజ్ అయ్యాయని టాక్, చిత్ర బృందం ప్రీ-ప్రొడక్షన్ పనులను సవ్యంగా నడిపిస్తోందని అర్థమవుతోంది. మే నుంచి షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తుండటంతో, చిరు నెక్స్ట్ సినిమా ‘విశ్వంభర’ రిలీజ్ అయిన వెంటనే పూర్తి ఫోకస్ ఈ కొత్త ప్రాజెక్ట్ మీదే ఉండనుంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌ను తక్కువ టైమ్‌లో పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. సంక్రాంతి హిట్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ అనిల్ రావిపూడి మళ్లీ అదే మ్యాజిక్‌ని ఈసారి మెగాస్టార్‌తో రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తాన్ని ఎంపిక చేసేందుకు ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉగాది రోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.