157 లో మెగాస్టార్ ద్విపాత్రాభిన‌యం!

వెండి తెర‌పై మెగాస్టార్ చిరంజీవి న‌వ్వించి చాలా కాల‌మ‌వుతోంది. కంబ్యాక్ త‌ర్వాత ఆయ‌న కామెడీ చిత్రాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు.

Update: 2025-02-25 06:50 GMT

వెండి తెర‌పై మెగాస్టార్ చిరంజీవి న‌వ్వించి చాలా కాల‌మ‌వుతోంది. కంబ్యాక్ త‌ర్వాత ఆయ‌న కామెడీ చిత్రాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. `వాల్తేరు వీర‌య్య‌`లో వీర‌య్య పాత్ర‌లో న‌వ్వించినా? అది పూర్తి స్థాయిలో పుల్ ఫిల్ కాలేదు. మాస్ కోణంలోనే ఆయ‌న చిత్రాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. స‌రిగ్గా ఇదే సమ‌యంలో అనీల్ రావిపూడి స‌రైన కామెడీ స్క్రిప్ట్ చెప్ప‌డంతో చిరంజీవి కాద‌న‌కుండా ఒకే చేసారు.

ఇది ప‌క్కా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. అనీల్ మార్క్ లో సిద్ద‌మైన స్క్రిప్ట్ ఇది. మెగా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు. ఈ స్టోరీ కి చిరంజీవి ఎంత‌గా క‌నెక్ట్ అయ్యారో ఇప్ప‌టికే లీక్ కూడా ఇచ్చేసారు. చాలా కాలం త‌ర్వాత చేయ‌బోతున్న గొప్ప కామెడీ చిత్రంగా అభివ‌ర్ణించారు. షూటింగ్ కోసం తాను కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అనీల్ తో ప‌నిచేసే అనుభవం కోదండ రామిరెడ్డితో చేస్తున్న‌ట్లు ఉంటుంద‌ని ముందుగానే తేల్చేసారు.

మెగాస్టార్ లో కామెడీ టింజ్ అన్న‌ది చిన్న‌ప్పుడే బీజం ప‌డింది. ఆయ‌న కెరీర్ ఆరంభంలో వైవిథ్య‌మైన కామెడీ పాత్ర‌లు పోషించి అల‌రించిన వారే. కాల‌క్ర‌మంలో మాస్ యాక్ష‌న్ స్టార్ గా మారారు గానీ...చిరంజీవి లో కామెడీ సెన్స్ అన్న‌ది ఎప్పుడూ హైలైట్ గానే ఉంటుంది. అయితే అనీల్ సినిమాలో చిరంజీవి ద్విపా త్రాభిన‌యం చేస్తున్నారట‌. అందులో ఒకటి పూర్తి కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ని తెలుస్తోంది.

మ‌రో పాత్ర అంతే సీరియ‌స్ గానూ సాగుతుంద‌ని చెప్పొచ్చు. చిరంజీవి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర‌ను అనీల్ సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా అంటే న‌వ‌ర‌సాలు ఉండాల్సిందే. అనీల్ కూడా అన్ని ర‌సాలు స‌మ‌పాళ్ల‌లో సిద్దం చేస్తాడు. ఆయ‌న స‌క్సెస్ ల‌కు కార‌ణం కూడా అదే.

Tags:    

Similar News