ఫ్యాన్స్ కోసం చిరు సంకల్పం!
అందులో ఒకటి రీసెంట్ గా అనౌన్స్ అయిన అనిల్ రావిపూడి సినిమా. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే అనౌన్స్ చేశాడు.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాను పూర్తి చేసే పనిలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఓ వైపు సినిమాలను చేస్తూనే మరోవైపు తన తర్వాతి సినిమాల కోసం కొత్త కథలను విని ఏవైనా కథలు నచ్చితే ఓకే చేసుకుంటూ వెళ్తున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన చేతిలో విశ్వంభర కాకుండా మరో రెండు సినిమాలున్నాయి.
అందులో ఒకటి రీసెంట్ గా అనౌన్స్ అయిన అనిల్ రావిపూడి సినిమా. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే అనౌన్స్ చేశాడు. సమ్మర్ లో అనిల్ సినిమా షూటింగ్ మొదలు కానుందని, సినిమా మొత్తం కామెడీ ప్రధానంగా ఉంటుందని చిరంజీవి తెలిపాడు. సినిమా చూసినంత సేపు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారని కూడా చిరూ హామీ ఇచ్చాడు.
అనిల్ తనకు కథ చెప్పినప్పుడు నవ్వకుండా ఉండలేకపోయానన్న చిరూ, ఎప్పుడెప్పుడు ఈ సినిమాలో నటిస్తానా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. స్వయంగా మెగాస్టార్ ఈ సినిమాను అనౌన్స్ చేయడంతో పాటూ ఈ రేంజ్ లో ఎలివేషన్స్ ఇవ్వడం చూసిన మెగా ఫ్యాన్స్ కు ఈ ప్రాజెక్టు పైన అంచనాలు పెరిగాయి.
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజవుతుందని కూడా చిరూ వెల్లడించాడు. వాస్తవానికి చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర మొన్న సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల విశ్వంభర రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో చిరూ ఫ్యాన్స్ ఈ విషయంలో డిజప్పాయింట్ అయ్యారు.
దీంతో తన తర్వాతి సినిమానైనా సంక్రాంతికి రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపాలని చూస్తున్నాడు చిరంజీవి. సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ చేసినా సంక్రాంతికి రిలీజ్ అంటే చాలా టైమ్ ఉంటుంది కాబట్టి అనిల్ ఈ లోపు సినిమాను ఫినిష్ చేసేయగలడు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ తోనే మంచి బజ్ క్రియేట్ అయింది.