మెగాస్టార్ తో అనిల్.. ఓ 'గేమ్ ఛేంజర్'

అనిల్ రావిపూడికి టాలీవుడ్‌లో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పూర్తిగా పాన్ ఇండియా లెవెల్‌లో ట్రై చేయలేదు.;

Update: 2025-03-07 06:28 GMT

మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కామెడీ, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే అనిల్ రావిపూడికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే, చిరంజీవి తన స్టైల్‌లో ఉంటూనే పూర్తిగా అనిల్ మార్క్ కామెడీ, మాస్ యాక్షన్ మిక్స్ చేసిన సినిమా చేయబోతున్నారని టాక్. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 90 రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్ తో రావిపూడి ముందుకెళ్తున్నాడు. ఇది నేటి సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదైన పరిస్థితి.

అనిల్ రావిపూడికి టాలీవుడ్‌లో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పూర్తిగా పాన్ ఇండియా లెవెల్‌లో ట్రై చేయలేదు. కానీ ఈ సినిమా ఆయన కెరీర్‌ను కొత్త దిశలో నడిపించే అవకాశం ఉంది. చిరంజీవి వంటి స్టార్‌తో 90 రోజుల్లో సినిమా పూర్తి చేస్తే, అతని మీద ఇండస్ట్రీలోని పెద్ద హీరోలకు కూడా ఒక కొత్త నమ్మకం వస్తుంది. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా హీరోలు దర్శకుల ఎంపిక విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు.

అనిల్ రావిపూడి తన కథల స్పాన్‌ను పెంచుకుంటూ, గ్రాండియర్ సినిమాలను కూడా జెట్ స్పీడ్‌లో ఫినిష్ చేయగలడు అనే పేరు తెచ్చుకుంటే, ఆ రేంజ్ స్టార్స్ కూడా అతనితో పని చేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. చిరంజీవి సినిమాలు గతంలో ఎక్కువగా లాంగ్ షెడ్యూల్స్‌తో నిర్మితమయ్యాయి. కానీ అనిల్ రావిపూడి సినిమాలు ఎక్కువ రోజులు తీసుకునే ట్రాక్‌లో ఉండవు. అతను తన స్క్రిప్ట్‌ను టార్గెట్ చేసుకున్న సమయానికి పూర్తి చేయడంలో దిట్ట.

ఈ సినిమా కూడా అదే ఫార్మాట్‌లో ఉంటే, అది ఇండస్ట్రీకి ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఉంటుంది. గతంలో చాలా సినిమాలు లాంగ్ డ్యూరేషన్ షూటింగ్‌ల కారణంగా విడుదల ఆలస్యమయ్యాయి. కానీ రావిపూడి సినిమా 90 రోజుల్లో ఫినిష్ అయితే, ఫ్యూచర్‌లో స్టార్ హీరోలు కూడా తక్కువ సమయంలో పెద్ద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి కెరీర్‌లో గేమ్ చెంజింగ్ లాంటిదని చెప్పవచ్చు.

ఎందుకంటే, ఇప్పటివరకు ఆయన ఎక్కువగా మాస్, కామెడీ ఎంటర్‌టైనర్స్ చేసినప్పటికీ, ఈసారి మెగాస్టార్‌తో వస్తున్నాడు. చిరు సినిమాలకి ఉండే గ్రాండ్‌నెస్, అనిల్ రావిపూడి సినిమా స్క్రీన్‌ప్లే కలిసి ఒక పవర్‌ఫుల్ కాంబినేషన్‌ను క్రియేట్ చేసే అవకాశముంది., F3, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు తన మార్క్‌ను చూపించాయి. కానీ చిరంజీవితో సినిమా అనిల్ రేంజ్‌ను ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమా సంక్రాంతి 2026కి రెడీ అవుతుందని ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ అయ్యింది. సంక్రాంతి బరిలో ఈ సినిమా భారీ హిట్ కొడితే, అనిల్ రావిపూడి కెరీర్ మరింత బలపడుతుంది. చిరంజీవికి కూడా మాస్ ప్లస్ కామెడీ మిక్స్ ఉన్న సినిమాలే ఎక్కువగా వర్కౌట్ అవుతాయి. ఇది హిట్ అయితే, భవిష్యత్తులో చిరు కూడా మరిన్ని లైట్‌హార్టెడ్ ఎంటర్‌టైనర్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాజెక్టు తో అనిల్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ గా నిలుస్తాడో లేదో చూడాలి.

Tags:    

Similar News