ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ కుమారుడు.. హుటాహుటీన సింగ‌పూర్‌కు చిరు

ప్రస్తుతం మార్క్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.;

Update: 2025-04-09 04:03 GMT
ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ కుమారుడు.. హుటాహుటీన సింగ‌పూర్‌కు చిరు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం సింగపూర్ లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. చిన్నారి బాలుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. పొగ ఎక్కువ‌గా పీల్చడం వల్ల స‌మ‌స్య తీవ్ర‌మైంద‌ని క‌థనాలొచ్చాయి. ప్రస్తుతం మార్క్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఈ వార్త అందిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా సింగ‌పూర్ వెళ్లారు. ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖ వెంటనే నిన్న రాత్రి సింగపూర్ కు బయలుదేరి మార్క్ ను క‌లుసుకున్నారు. చిన్నారి బాలుని వైద్య పరిస్థితిని అంచనా వేశారు. మార్క్ కు సాధ్యమైనంత ఉత్తమ వైద్య చికిత్స అందేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న గురించి విన్న వెంటనే చిరంజీవి, సురేఖ వేగంగా సిద్ధమై సింగపూర్ కు బయలుదేరి మార్క్ ను సందర్శించార‌ని తెలిసింది.

సింగ‌పూర్‌లో ఘటన జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామ రాజు జిల్లాలో షెడ్యూల్ ప్రకారం పర్యటనలో ఉన్నారు. అధికారులు, పార్టీ నాయకులు పర్యటనను ఆపేయాల‌ని సూచించినా మన్యం ప్రాంతంలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తానని ఇచ్చిన హామీకి ఆయన కట్టుబడి ఉన్నారు. మన్యంలో తన పర్యటనను ముగించుకున్న తర్వాత ఆపై నేరుగా సింగపూర్‌కు వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్ప‌త్రి నుంచి తాజా బులెటిన్ వెలువ‌డాల్సి ఉంది. చిన్నారి మార్క్ శంక‌ర్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News