జైలర్ -2 కోసం మెగాస్టార్ ని లైన్ లోకి తెస్తున్నారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ -2`కు సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ -2`కు సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ఆ సినిమా షూటింగ్ పూర్త వుతుంది. అనంతరం రజనీ `జైలర్-2`లో జాయిన్ అవుతారు.
అయితే ఈ చిత్రాన్ని `జైలర్` ని మించి నెల్సన్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. `జైలర్` లో స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ గెస్ట్ పాత్రలు సినిమాకి ఎంత హైలైట్ అయ్యాయో తెలిసిందే. తెరపై కనిపిం చింది కాసేపే అయినా థియేటర్లో అరుపులు అరిపించిన పాత్రలవి. ఒక్కో హీరో ఎంట్రీ థియేటర్లలో విజిల్స్ వేయించింది. రజనీకాంత్ ఇంటరడక్షన్ కి ఏమాత్రం తగ్గకుండా పాత్రల్ని నెల్సన్ మలిచిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇప్పుడా పాత్రలు రెండవ భాగంలో ఉంటాయా? ఉందడా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే కొత్తగా మాత్రం మరికొంత మంది స్టార్లను మాత్రం యాడ్ చేస్తున్నారుట. దీనిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో గెస్ట్ పోషిస్తున్నట్లు సమాచారం. మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చిరు ఎంట్రీ ఉంటుందని వినిపిస్తుంది. అదే నిజమైతే అభిమానులకు పండగే. రజనీకాంత్-చిరంజీవిలను ఒకే ప్రేమ్ లో చూసి చాలా కాలమవుతుంది. కెరీర్ ఆరంభంలో ఇద్దరు కలిసి నటించారు.
ఆ తర్వాత మళ్లీ ఆ ఛాన్స్ రాలేదు. మళ్లీ ఇంత కాలానికి ఆ కాంబో తెరపైకి రావడం విశేషం. గెస్ట్ రోల్స్ విషయంలో చిరంజీవి కాదనకుండా అంగీకరిస్తారు. గతంలో పలువురు తెలుగు హీరోల చిత్రాల్లోనూ ఆయ గెస్ట్ అపిరియన్స్ ఇచ్చారు. రజనీకాంత్ కూడా ఇతర హీరోల చిత్రాల్లో అలాగే గెస్ట్ పాత్రల్లో కనిపిస్తుంటారు. పైగా ఇద్దరు మంచి స్నేహితులు. కాబట్టి మెగాస్టార్ నో చెప్పే చాన్సే లేదు.