ఆడపిల్ల గురించి చిరంజీవి ఆ మాట అనాల్సింది కాదు!

అయితే దీనిని `ఆడ‌పిల్ల వ‌ర్సెస్ మ‌గ‌పిల్లాడు` టాపిక్‌గా మార్చి, నెటిజ‌నులు రెండు వ‌ర్గాలుగా డివైడ్ అయ్యి డిబేట్ పెట్టారు.

Update: 2025-02-12 11:30 GMT

నిన్న జరిగిన ఒక సినిమా వేడుకలో ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి త‌న జీవితంలోని కీల‌క ఘ‌ట్టాల గురించి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌గా మారాయి. ప‌బ్లిక్ ఈవెంట్లో మాట్లాడుతూ.. తన లెగ‌సీని ముందుకు తీసుకెళ్ల‌డానికి మనవడు లేకపోవడంపై మెగాస్టార్ తన నిరాశను వ్యక్తం చేసారు. అయితే దీనిని 'ఆడ‌పిల్ల వ‌ర్సెస్ మ‌గ‌పిల్లాడు' టాపిక్‌గా మార్చి, నెటిజ‌నులు రెండు వ‌ర్గాలుగా డివైడ్ అయ్యి డిబేట్ పెట్టారు.

ఇంత‌కీ మెగాస్టార్ వాళ్ళ దృష్టిలో అంత త‌ప్పుడు మాట ఏమ‌న్నారు? అంటే.. "నేను ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయిలు మాత్రమే నా చుట్టూ ఉంటారు. వారిని చూస్తుంటే నేను లేడీస్ హాస్టల్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. నేను వారికి వార్డెన్‌ని`` అని వ్యాఖ్యానించారు. రామ్ చరణ్‌కు రిక్వెస్ట్ చేశాను ఒక అబ్బాయిని కనాలి అని అత‌డు మన వారసత్వాన్ని కొనసాగిస్తాడని చెప్పాను.  కానీ చరణ్ కి మళ్ళీ మరో కూతురు పుడుతుందేమో అని నేను కొంచెం భయపడుతున్నాను..ఎందుకంటే చరణ్ అంత గారం చేస్తాడు తన కూతురిని అని అన్నారు." చ‌ర‌ణ్ కుమార్తె క్లిన్ కారా గురించి చిరు ప్ర‌స్థావించారు.

స్వ‌త‌హాగానే భోళా శంక‌రుడు అయిన మెగాస్టార్ స‌ర‌దాగా న‌వ్వేస్తూ మాట్లాడేస్తుంటారు. ఈసారి కూడా వేదిక‌పై అంద‌రినీ న‌వ్విస్తూనే, త‌న‌దైన శైలిలో జోక్ చేస్తూ వేదిక‌పై చాలా అంశాల‌ను ముచ్చ‌టించారు. కుటుంబం, రాజ‌కీయం, లెగ‌సీ ఇలా ప్ర‌తి టాపిక్ పైనా ఆయ‌న స‌ర్కాజ‌మ్, హాస్యం అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. కానీ ఆడ‌పిల్ల మ‌గ‌పిల్ల టాపిక్ మాత్రం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. సోష‌ల్ మీడియా యుగంలో ఇలాంటివి త్వ‌ర‌గా ర‌చ్చ‌వుతుంటాయి. ప్ర‌తిదీ పెద్ద చ‌ర్చ‌గా మారుతుంద‌ని ఇప్పుడు నిరూప‌ణ అయ్యింది.

అయితే చిరు చేసిన ఆ వ్యాఖ్య ఫెమినిస్టుల‌ను అక‌స్మాత్తుగా నిద్ర లేపింది. ``ఆడపిల్లలు మాత్రమే ఉండటంలో తప్పు ఏమిటి? ఇంట్లో మగపిల్లవాడు కావాలని కోరుకోవడం స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వాన్ని చూపిస్తుంది`` అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. చిరంజీవి అంత‌టి పెద్ద స్థాయి సెల‌బ్రిటీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయాల్సింది కాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే చాలా మంది .. ఆ స‌మ‌యంలో భోళాగా ఆ మాట‌లు అన్నారు కానీ, ఆయ‌న‌కు స్త్రీల విష‌యంలో గౌర‌వం ఎంత‌మాత్రం త‌గ్గ‌లేద‌ని మెగాస్టార్‌ను సమర్థించారు. మ‌హిళ‌ల‌ను త‌గ్గించే వ్య‌క్తిత్వం ఆయ‌న‌ది కాద‌ని కూడా చాలా మంది స‌మ‌ర్థించారు. చిరు ఎప్పుడూ ఆడ‌వారిని గౌర‌విస్తూ మాట్లాడ‌తార‌ని, కుటుంబంలో మ‌హిళ‌ల‌కు ఎంతో స‌ముచిత స్థానాన్ని ఇచ్చార‌ని కూడా చాలా మంది మ‌ద్ధ‌తుగా నిలిచారు.

కుమారుడు రామ్ చరణ్‌తో పాటు, చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల ఉన్నారు. అలాగే చిరు చుట్టూ న‌లుగురైదుగురు మనవరాళ్లు ఎప్పుడూ ఉంటారు. వీరిలో రామ్ చ‌ర‌ణ్‌-ఉపాసన దంపతులకు జన్మించిన క్లిన్ కారా కొణిదెల కూడా చేరారు. అంద‌రూ ఆడ‌పిల్ల‌లేనా.. ఒక మ‌గ పిల్లాడు అయినా లేడు అనే మాట‌ను ఆయ‌న జోవియ‌ల్ గా అన్నారు. దానిని నెటిజ‌నులు డిబేట్ గా మార్చారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... చిరంజీవి తదుపరి మోస్ట్ అవైటెడ్ `విశ్వంభర`లో న‌టిస్తున్నారు. ఆయ‌న‌ చివరిసారిగా 2023లో వాల్టెయిర్ వీరయ్య, భోలా శంకర్ చిత్రాల‌లో కనిపించారు. త‌దుప‌రి విశ్వంభ‌ర పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాని హిందీలోను అత్యంత భారీగా విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.

Tags:    

Similar News