మెగా బాస్.. రెండు సినిమాలు, రెండు డేట్లు

అదే సమయంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరు చేయనున్న సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి.;

Update: 2025-04-08 08:30 GMT
మెగా బాస్.. రెండు సినిమాలు, రెండు డేట్లు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో కూడా అదే స్పీడ్.. అదే గ్రేస్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా తన సోషియో ఫాంటసీ జోనర్ మూవీ విశ్వంభర ను కంప్లీట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఆ సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చిరు.

అదే సమయంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరు చేయనున్న సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఆ తర్వాత స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్.. అప్పుడే మూవీపై భారీ అంచనాలు నెలకొల్పారు. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారు! యమా స్పీడ్ లో పూర్తి చేయాలని చూస్తున్నారని టాక్.

అయితే ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి విశ్వంభర మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో మేకర్స్ అప్పుడు సినిమా విడుదలను వాయిదా వేశారు. ఆ తర్వాత సమ్మర్ స్పెషల్ గా లక్కీ డేట్ మే 9వ తేదీన రిలీజ్ చేస్తారని తెగ డిస్కషన్ జరిగింది.

కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. జులై 24వ తేదీన మూవీ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విశ్వంభర మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజమేనని తెలుస్తోంది. జనవరి 10వ తేదీన విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని, షూటింగ్ స్పీడ్ గా చేయనున్నారని సమాచారం.

అయితే ఆ రెండు సినిమాలు కాకుండా చిరు లైనప్ లో శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ ఉంది. నేచురల్ స్టార్ నాని సమర్పించనున్న ఆ సినిమా అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చేసింది. దాంతోపాటు మరిన్ని చిత్రాలు డిస్కషన్ లో ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి లైనప్ విషయంలో చిరు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారన్నమాట. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News