మెగాస్టార్ చేత ఊచకోత ప్లాన్

గత కొద్ది రోజులుగా చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మూవీ ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరగ్గా.. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

Update: 2024-12-04 04:25 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ సెట్స్ పై ఉండగా.. ఇప్పుడు మరో యువ దర్శకుడు, తన ఫ్యాన్ శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారు చిరంజీవి.

గత కొద్ది రోజులుగా చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మూవీ ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరగ్గా.. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. చిరు- ఓదెల ప్రాజెక్ట్ కు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

చిరు, ఓదెల మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను షేర్ చేస్తూ నాని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఆయన (చిరంజీవి) నుంచి స్ఫూర్తి పొందుతూ ఎదిగా. ఆయన సినిమాల కోసం గంటల తరబడి క్యూ వేచి చూశా. లాస్ట్ కు నా సైకిల్‌ కూడా పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆయననే మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా" అని నాని పోస్ట్ పెట్టారు.

మెగాస్టార్‌ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి తామెంతో వేచి చూస్తున్నామంటూ రాసుకొచ్చారు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో తన కల సాకారం కాబోతోందని తెలిపారు. అదే సమయంలో శ్రీకాంత్ కూడా పోస్ట్ పెట్టారు. ప్రామిస్ చేస్తూ ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ హామీ ఇచ్చారు.

చిరంజీవి కూడా తాను ఈ ప్రాజెక్ట్ పట్ల థ్రిల్లింగ్ గా ఉన్నట్లు పోస్ట్ పెట్టారు. ఎంతో వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే చిరు- ఓదెల మూవీ కాన్సెప్ట్ పోస్టర్ అయితే వేరే లెవెల్ లో ఉంది. మొత్తం రెడ్ కలర్ థీమ్ లో ఉన్న పోస్టర్ లో హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడంటూ ఇచ్చిన రైటప్ సినిమాపై ఓ రేంజ్ లో ఆసక్తి రేపుతోంది.

పోస్టర్ లో రక్తం కారుతున్న చిరంజీవి చెయ్యిని చూపించారు మేకర్స్. ఇది చిరు కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరు- ఓదెల ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్ తెగ చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు.

కాన్సెప్ట్ పోస్టర్ తో ఒక్కసారిగా అంతా షేక్ అయిందని చెబుతున్నారు. మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అన్నారంటే.. మెగాస్టార్ తో శ్రీకాంత్ ఊచకోతను ప్లాన్ చేసినట్లు ఉన్నారని అంటున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అంటూ సందడి చేస్తున్నారు. అయితే అనౌన్స్మెంట్ తోనే సినిమాపై మొత్తానికి ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది.

వచ్చే ఏడాది చిరు-ఓదెల మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాని ప్రజెంట్ చేస్తుండగా సుధాకర్ చెరుకూరు ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి 2025లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు చిరు కూడా ఓకే చెప్పారట.

మరోవైపు, శ్రీకాంత్ ఓదెలతో మూవీ అనౌన్స్మెంట్ టైమ్ లోనే చిరు లేటెస్ట్ స్టిల్స్ బయటకు వచ్చాయి. బ్లాక్ జీన్స్ అండ్ టీ షర్ట్ లో ఆయన అదరగొట్టారు. లుక్స్ అండ్ గ్రేస్ తో ఫిదా చేసేశారు. సీనియర్ కాదు.. అచ్చం యంగ్ హీరోలా కనిపిస్తున్నారు. ఇప్పుడు చిరు కొత్త స్టిల్స్ చూసి ఆయన వయసు పెరుగుతుందా లేక తగ్గుతుందా అని అంతా నోరెళ్లబెడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో చిరు కొత్త పిక్స్.. కొత్త మూవీ కాన్సెప్ట్ పోస్టర్.. తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News