మెగాస్టార్ విషయంలో హాస్యబ్రహ్మలా అందరూ!
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తలలో నాలుక లాంటి వారు. దర్శకరత్న దాసరి నారాయణరావు స్వర్గస్తులైన తర్వాత ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలు వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తలలో నాలుక లాంటి వారు. దర్శకరత్న దాసరి నారాయణరావు స్వర్గస్తులైన తర్వాత ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలు వహిస్తున్నారు. ఓ పెద్దగా ఇండస్ట్రీకి చిరంజీవి అందించాల్సిన సేవలన్నీ అందిస్తున్నారు. చిరంజీవి తర్వాత నటులు ఎవరైనా ఇండస్ట్రీకి ఎవరి స్పూర్తితో వచ్చావ్ అంటే? చిరంజీవి పేరు మాత్రమే చెబుతారు. ఎందుకంటే స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి కాబట్టి.
ఈ విషయాన్ని హాస్య బ్రహ్మ చాలా సందర్భాల్లో చెప్పారు. బ్రహ్మనందం విజయంలో చిరంజీవిని ఎప్పుడూ భాగస్వామ్యం చేస్తారు. ఏ వేదికపైనా మెగాస్టార్ గురించి ఎంతో గొప్పగా చెబుతారు. ఆయన విజయాలు, కష్టాలు.. సుఖాలు అన్నింటిని తెరచిన పుస్తకంలా పంచుకుంటారు. వ్యక్తిగతంగా మెగాస్టార్ తనకు చేసిన సహాయం గురించి చెప్పడంలో బ్రహ్మానందం ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. సాధారణంగా ఓ స్టేజ్ కి వచ్చిన తర్వాత చేసిన సహాయాన్ని సైతం చాలా మంది మర్చిపోయి వ్యవహరిస్తుంటారు.
కానీ బ్రహ్మానందం నోట మాత్రం చిరంజీవి సహకారం తనకు లేదు అని ఏనాడు అనలేదు. మెగాస్టార్ కి హాస్యబ్రహ్మ ఎప్పుడు విధేయుడే. అయితే మెగాస్టార్ సహాయం పొందిన కొంత మంది ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు అన్న వాదన సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎప్పుడో సహాయం చేసిన చిరంజీవికి గురించి బ్రహ్మానందం అంత గొప్పగా చెబుతుంటే? అదే చిరంజీవి సహాయం పొందిన వారు ఇప్పుడు కృతజ్ఞతా భావం లేకుండా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది.
అయితే ఈ చర్చలో నిజమెంతో తేలాలి. ఇది వాస్తవమా? అవాస్తవమా? వెనుకుండి ఎవరైనా? ఇలా చేయిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా మెగా అభిమానుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ టార్గెట్ అవ్వడం కొత్తేం కాదు. కొందరు రాజకీయ లబ్ది కోసం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారనే వాదన ఎప్పుడూ బలంగానే తెరపైకి వస్తుంది.