చిరు - అనిల్.. మరో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోందంటే..?

అయితే ఈసారి కథ కాస్త భిన్నంగా ఉండనుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్‌ రవిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.;

Update: 2025-04-02 16:06 GMT
చిరు - అనిల్.. మరో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోందంటే..?

స్టార్ డైరెక్టర్ అనిల్ రవిపూడికి విక్టరీ వెంకటేష్‌తో మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. వెంకీకి సరిపడే కామెడీ, ఎమోషన్ మిక్స్ చేస్తూ కథను తీసుకెళ్లడంలో అనిల్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈ కాంబో మళ్లీ ఓ స్పెషల్ సినిమాకి రీ యూనైట్ కావడం సినీ వరల్డ్ లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈసారి కథ కాస్త భిన్నంగా ఉండనుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్‌ రవిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇందులో వెంకటేష్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. చిరంజీవి కథానాయికకు స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపిస్తే, వెంకటేష్ పాత్ర మాత్రం సెకండ్ హాఫ్‌లో ఎంటర్ అవుతూ కథను పూర్తిగా మలుపు తిప్పేలా ఉంటుందట.

వెంకటేష్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో దాని కోసం దర్శకుడు అనిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. వెంకీ స్టైల్‌కు తగ్గట్లు ఫన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని అంగాలను కలిపి పాత్రను డిజైన్ చేశాడట. అంతేకాకుండా ఈ పాత్ర కోసం ఒక హై ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్ కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేశారట. వెంకటేష్ లుక్స్ కూడా మామూలుగా ఉండవని, కొంచెం కొత్తదనం కనిపించబోతోందని సమాచారం.

ఈ సినిమా హైలైట్‌లో భాగంగా చిరంజీవి, వెంకటేష్‌లపై ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోందట. అభిమానులకి ఇది ఓ విజువల్ ట్రీట్‌గా మారేలా ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు సీనియర్ స్టార్స్ కలిసి డాన్స్ చేయడం, మాస్ మూమెంట్స్‌లో కనిపించడం రేర్ కాంబినేషన్ కావడంతో ఆ పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ పాటలో ఎమోషన్, ఎనర్జీ రెండూ బ్యాలెన్స్ చేస్తారని తెలుస్తోంది.

అనిల్ రవిపూడి ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలా ఎంగేజ్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు. ఈసారి చిరు-వెంకీ.. ఇద్దరు లెజెండ్స్ ఉన్నా, ఒక్కొక్కరి పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఇచ్చేలా స్క్రిప్ట్ వర్క్ చేశారట. కామెడీ, యాక్షన్, ఎమోషన్‌తో పాటు పెద్ద స్కేల్‌లో మేకింగ్ ఉండేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాంతో అభిమానులలోనే కాదు, ట్రేడ్ వర్గాల్లోనూ సినిమాపై బజ్ బాగా పెరిగింది. మొత్తానికి చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమాతో మరోసారి వెంకటేష్ స్పెషల్ కెరెక్టర్‌తో మెప్పించబోతున్నాడు. చిరంజీవి, వెంకటేష్ కలిసి స్క్రీన్ పంచుకోవడం అంటేనే ఫ్యాన్స్‌కి పండగే. ఇక అనిల్ రవిపూడి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News