మెగాస్టార్ కి 2024 వెరీ స్పెషల్!
మెగాస్టార్ చిరంజీవికి 2024 వెరీ స్పెషల్. ఆయనకే కాదు ఆయన అభిమానులకు సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవికి 2024 వెరీ స్పెషల్. ఆయనకే కాదు ఆయన అభిమానులకు సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. తాజాగా గిన్సీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిన సంగతి తెలిసిందే. గిన్నీస్ గౌరవం మెగాస్టార్ ని వెతుక్కుంటూ మరీ వచ్చింది.
తాజాగా ఐఫా కూడా ఆయన ఖాతాలో చేరింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) - 2024 పురస్కారాల్లో ప్రతిష్ఠాత్మకమైన 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమాస కు గానూ చిరంజీవకి గౌరవం దక్కింది. ఒకేఏడాది ఇలా ఇన్నివేదికలపై మెగాస్టార్ కనిపించడం ఇదే తొలిసారి. అన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు కావడం విశేషం. అంతకు ముందు మరెన్నో అవార్డులు..అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో అవార్డు-రివార్డులు అందుకున్నారు. ఆరకంగా మెగాస్టార్ ఓ చరిత్ర సృష్టించారు అని చెప్పొచ్చు.
మెగాస్టార్ అంటేనే ఓ చరిత్ర. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శివ శంకర్ వరప్రసాద్ మెగాస్టార్ గా ఎదిగిన వైనం ఎంతో మందికి స్పూర్తి. ఆయన స్పూర్తితో కళా రంగంలో స్థిరపడిన వారెంతో మంది. నటులుగా ,దర్శక, నిర్మాతలుగా ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారంటే? దానికి చిరంజీవి వేసిన బీజం కారణం. నెటి జనరేషన్ యువతకి మెగాస్టార్ ఆదర్శం.
వీటన్నింటిని పక్కన బెడితే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా సాధించిన విజయం ఆయన్ని ఎంతో గొప్ప సంతోషానికి గురి చేసిన అంశంగా చెప్పాలి. 2019 ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయినా 2024 లో మాత్రం టీడీపీతో కూటమిగా ఏర్పడి పోటీ చేసినా 21 స్థానాల్లో గెలిచి...పవన్ ఎమ్మెల్యేగా గెలవడం..అక్కడ నుంచి డిప్యూటీ సీఎం అవ్వడం మెగా ఫ్యామిలీకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ రకంగా తమ్ముడి విషయంలోనూ 2024 కలిసొచ్చిన ఏడాది గా చెప్పొచ్చు.