చిరంజీవి కూల్ గా..ఇంకా ఎన్ని నెలలు?
సోషియా ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం కావడంతో సీజీ వర్క్ హాంకాంగ్ లో కూడా కొంత పని జరుగుతుంది.;
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `విశ్వంభర` రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాని సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే, ఆగస్ట్ అంటూ వినిపిస్తుంది. కానీ ఏది క్లారిటీ లేదు. రిలీజ్ విషయంలో చిత్ర బృందం మౌనం వహిస్తోంది. సినిమాకు సంబంధించి సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో రిలీజ్ విషయంలో స్పష్టత లోపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత వర్క్ పూర్తయింది. అయితే పూర్తి చేయాల్సిన సీజీ ఇంకా చాలానే ఉంది.
సోషియా ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం కావడంతో సీజీ వర్క్ హాంకాంగ్ లో కూడా కొంత పని జరుగుతుంది. మేజర్ సన్నివేశాలకు సంబంధించి పనంతా అక్కడే జరుగుతుందని సమాచారం. అలాగే సినిమాలో ఓ ఐటం పాట కూడా ఉందిట. ఆ పాటకి సంబంధించి ఇంకా షూట్ మొదలవ్వలేదు. అందులో ఏ భామ నటించాలి అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది.
శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మడు పోలేదుట. అలాగే ఓటీటీ రైట్స్ విషయంలో ఇప్పటి వరకూ సంస్థలు ఏవీ ముదుకు రాక పోగా ఇప్పుడిప్పుడే ఆ బిజినెస్ గేట్లు తెరుచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కొన్ని ఓటీటీలు ఇప్పటికే బేరసారాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఓటీటీ డీల్ తర్వాత శాటిలైట్ విషయంలోనూ క్లారిటీ వస్తుంది. అయితే ఇంత వరకూ ఈ సినిమాకి సంబంధించి పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.
వావ్ అనిపించే ప్రచార చిత్రాలేవి రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఓటీటీ , శాటిలైట్ విషయంలో కొంత స్థబ్తత ఏర్పడి ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది. చిరంజీవి ఈ సినిమాకి సంబంధించి ఇంకా డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ గ్యాప్ లోనే ఆయన కొత్త సినిమా అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలని చూస్తున్నారు.