విశ్వంభర రిలీజ్ బ్లాక్ బస్టర్ డేట్ కి ఫిక్సైందా!
ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ ముహూర్తం పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. జులై 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.;

'విశ్వంభర' రిలీజ్ తేదీపై మేకర్స్ నిర్ణయం తీసుకున్నారా? రిలీజ్ తేదీ ఫిక్సై పోయిందా? ప్రచారం పనులు కూడా షురూ చేయడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కథానా యకుడిగా వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి.
కానీ సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో? వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ కూడా హైడ్ చేసారు. దీంతో రిలీజ్ తేది ఎప్పుడొస్తుందా? అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ ముహూర్తం పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. జులై 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తేదీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమా సరిగ్గా ఇదే నెల తేదీలో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందే తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తేదీ సెంటిమెంట్ గానూ కలిసొస్తుందని మేకర్స్ జూలై 24 ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈనెల 12 నుంచి ప్రచారం పనులు కూడా మొదలు పెట్టబోతున్నారుట. దీనిలో భాగంగా తొలి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.
ఇది రాముడిపై సాగే భక్తి గీతమని సమాచారం. అదే జరిగితే అప్పటి నుంచి ఒక్కో సాంగ్ రిలీజ్ వరకూ శ్రోతల ముందుకు రానున్నాయి. అలాగే టీజన్, ట్రైలర్ ఇలా ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నారు. ఇదొక సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్. చిరంజీవి కెరీర్ లోనే మరో భారీ బడ్జెట్ చిత్రమిది. 'సైరా నరసింహారెడ్డి' తర్వాత అంతటి బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.