Jr ఎన్టీఆర్.. ఆ సినిమా విషయంలో చిరు సలహా

మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ లో చాలా మంది హీరోలకి ఒక ఇనిస్పిరేషన్, రోల్ మోడల్ అనే సంగతి అందరికి తెలిసిందే.

Update: 2023-12-13 03:49 GMT

మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ లో చాలా మంది హీరోలకి ఒక ఇనిస్పిరేషన్, రోల్ మోడల్ అనే సంగతి అందరికి తెలిసిందే. అలాగే చిరంజీవి మంచి ఫ్రెండ్లీ నేచర్ తో హీరోలు అందరితో మంచి క్లోజ్ రిలేషన్ మెయింటేన్ చేస్తూ ఉంటారు. యంగ్ హీరోలలో కూడా కూడా చాలా మంది చిరంజీవితో చాలా సరదాగా ఉంటారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి మంచి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని వారే చాలా సందర్భాలలో చెప్పారు. ఆ ఫ్రెండ్ షిప్ కారణంగానే ఆర్ఆర్ఆర్ సినిమా అంత భాగా కుదిరింది. హీరోల ఫ్యాన్స్ వేరైనా వారిద్దరి మధ్య మంది రిలేషన్ ఉంది. మెగాస్టార్ చిరంజీవికి సైతం ఒక యాక్టర్ గా రామ్ చరణ్ కంటే తారక్ ఎక్కువ ఇష్టం అంట. తారక్ కూడా చిరంజీవితో ఒక కొడుకులా చాలా క్లోజ్ రిలేషన్ కలిగి ఉంటారు.

కెరియర్ ఆరంభంలో తారక్ కి చిరంజీవి ఒక సినిమా విషయంలో ఫోన్ చేసి మరీ చేయొద్దని చెప్పారంట. అయిన కూడా తారక్ మాటిచ్చానని మూవీ చేసి డిజాస్టర్ అందుకున్నారు. ఆ సినిమానే పూరి దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా. తారక్ కెరియర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీగా ఈ చిత్రం మారింది. తరువాత కొంతకాలం అతని కెరియర్ మీద కూడా ఆ మూవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ఈ మూవీ తారక్ ఒప్పుకున్నాడని తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి అతనికి ఫోన్ చేసారంట. ఆ కథ పూరి జగన్నాథ్ ముందుగా తనకి చెప్పారు. నచ్చలేదని రిజక్ట్ చేశాను. నీకైతే అస్సలు సెట్ అవ్వదు. చేయొద్దని సూచించారంట. అయితే ఎన్టీఆర్ ముందుగా పూరికి మాటిచ్చి ఉండటంతో, చిరంజీవి వద్దని చెప్పిన కూడా ఆంధ్రావాలా మూవీ చేసారంట. నిజంగానే చిరంజీవి చెప్పినట్లు ఆ సినిమా ఎన్టీఆర్ కి అస్సలు సెట్ కాలేదు.

తారక్ ఏర్పరుచుకున్న కమర్షియల్ ఇమేజ్ ని కూడా ఆంధ్రావాలా డిస్టర్బ్ చేసింది. పూరీ జగన్నాథ్ తన స్టైల్ లో కాకుండా కంప్లీట్ కమర్షియల్, యాక్షన్ జోనర్ లో తండ్రికొడుకుల కథగా దానిని ఆవిష్కరించారు. పూరి స్టైల్ లేకపోవడం కూడా ఆ మూవీ డిజాస్టర్ కి ఒక కారణం. అలాగే తండ్రి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అస్సలు సెట్ కాలేదని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. సినిమాని ఎంతగా ప్రమోట్ చేసిన కూడా ఆంధ్రావాలా నిర్మాతకి కూడా భారీ నష్టాలు తీసుకొచ్చింది.

Tags:    

Similar News