భోళా.. చివరి నిమిషంలో ఈ టెన్షనేంటో!
చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదలకు ముందే ఊహించని స్థాయిలో నలు వైపులా కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే అందులో కొన్ని సినిమాకు ప్రమోషన్స్ గా ఉపయోగపడినప్పటికీ మరికొన్ని ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది సినిమా విడుదలయితే కానీ అర్థం కాదు.
ముందుగా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు ఏజెంట్ కారణంగా సినిమా నిర్మాతకు కూడా ఊహించని స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక టికెట్ల రేట్ల వ్యవహారం కూడా ఇంకా సస్పెన్స్ లోనే కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా ఎంతో సమయం లేదు.
దానికి తోడు చిత్ర నిర్మాతలు అడ్వాన్స్ బుకింగ్స్ తొందరగా స్టార్ట్ చేయకపోవడం కూడా సినిమా ఓపెనింగ్స్ పై ఎంతో కొంత ప్రభావం చూపకనే చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చిత్ర నిర్మాతలు ఎంతో కొంత టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. అయితే అధికారులు మాత్రం సరైన ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అయితే సమర్పించలేదు అని చెబుతున్నారు.
సమర్పించాల్సిన డాక్యుమెంట్లలో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 శాతానికి పైగా షూటింగ్ చేసినట్లు ప్రూఫ్ చూపించాలి. ఇక అంతే కాకుండా సినిమా బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉండాలి. ఇలాంటివి నిర్మాత అనిల్ ఇంకా సమర్పించలేదు అనే ప్రభుత్వ ప్రతినిధుల నుంచి సమాధానాలు వచ్చాయి.
అయితే మెగాస్టార్ చేసిన వ్యాఖ్యల కారణంగానే టికెట్ల రేట్లు పెంచుకొనివ్వడం లేదు అనే విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో సజ్జల లాంటి ప్రముఖ నాయకులు మాత్రం దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు అని సరైన డాక్యుమెంట్స్ తో పాటు అధికారులను సంప్రదిస్తే వారే తగిన అనుమతులు ఇస్తారు అనే విధంగా సమాధానం ఇచ్చారు.
ఏదేమైనప్పటికీ కూడా సినిమా విడుదల కావడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఇక ఈ క్రమంలో టికెట్లు రేట్ల వ్యవహారం ఓక కొలిక్కి రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకు టికెట్ల రేట్లు పెరిగితేనే ఎంతోకొంత ఓపెనింగ్స్ ద్వారా బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఈ క్రమంలో భోళా శంకర్ కు ఎలాంటి న్యూస్ అందుతుందో చూడాలి.