బాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి అందుకే దూరం!
మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మంది అభిమానులున్న పెద్ద స్టార్. 150కి పైగా సినిమాల్లో నటించిన చరిత్ర ఆయన సొంతం
మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మంది అభిమానులున్న పెద్ద స్టార్. 150కి పైగా సినిమాల్లో నటించిన చరిత్ర ఆయన సొంతం. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. మరి అంతటి లెజెండ్ బాలీవుడ్ లో సినిమాలు చేసింది చాలా తక్కువ. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు చేసినా కాలక్రమేణా ఆయన మేనియా కేవలం టాలీవుడ్ కే పరిమితమైంది. ఓ మూడు సినిమాల తర్వాత మళ్లీ హిందీ సినిమాల జోలికి వెళ్లలేదు.
ప్రస్తుతం స్టార్ అంతా పాన్ ఇండియాని షేక్ చేస్తుంటే? చిరంజీవి మాత్రం ఇంకా సీరియస్ గా నేషనల్ మార్కెట్ పై దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. ఆ మధ్య సైరా నరసింహారెడ్డిని పాన్ ఇండియా లో రిలీజ్ చేసినా అది ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఆ తర్వాత మళ్లీ అలాంటి అటెంప్ట్ లు చేయలేదు. మరి మెగాస్టార్ బాలీవుడ్ లో ఎందుకు సినిమాలు చేయలేదు? ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు రివీల్ చేసారు.
'అప్పటి బాలీవుడ్ అగ్ర దర్శకులు మనోహాన్ దేశాయ్.. ప్రకాష్ మెహ్రా.. సుజిత్ నదియావాలా లాంటి నాకు చాలా కథలు వినిపించారు. కానీ అవేవి నాకు నచ్చలేదు. ఆ సమయంలో కథ నచ్చితే కచ్చితంగా చేసి ఉండేవాడిని. ఏ సినిమాకైనా..ఎక్కడ తీసినా కథే బలం. నాకు నచ్చిన కథలు వచ్చినట్లైతే తప్పకుండా చేస్తా' అని అన్నారు. ఇది ఓ పాత ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి. అయితే తాజా సినారే పూర్తిగా మారింది.
తెలుగు సినిమా పాన్ ఇండియాలో సత్తా చాటుతుంది. సినిమా నిర్మాణ వ్యయం అంతకంతకు పెరుగు తుంది. తీస్తే పాన్ ఇండియా సినిమా తీయాలి! అన్న ఆలోచన దృక్ఫధం మేకర్స్ లో బలంగా కలుగు తుంది. తారక్..చరణ్...బన్నీ...ప్రభాస్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. రాజమౌళి సినిమా తో మహేష్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా పాన్ ఇండియాని షేక్ చేసే సినిమాలతో రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తోన్న 156వ చిత్రం అతీంద్రీయ శక్తుల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఇది పాన్ ఇండయాకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి.