మెగాస్టార్ ఇంట‌ర్వ్యూ చేసిన అభిమాన హీరో!

మ‌రి అలాంటి మెగాస్టార్ మెచ్చిన హీరో ఎవరు? అలాంటి హీరోని చిరంజీవి ఇంట‌ర్వ్యూ కూడా చేసారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

Update: 2024-08-22 12:23 GMT

మెగాస్టార్ చిరంజీవిని అభిమానించ‌ని వారు ఎవ‌రుంటారు. కోట్లాది మంది హృద‌యాల్లో గొప్ప స్టార్ అత‌ను. న‌టుడిగా , స‌మాజ సేవ‌కుడిగా చిరంజీవి ప్ర‌యాణం చిర‌స్మ‌ర‌ణీయం. ఇప్ప‌టికీ చిత్ర ప‌రిశ్ర‌మకు తాను అందించాల్సిన సేవ‌ల్ని అందిస్తూనే ఉన్నారు. న‌టుడిగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. మ‌రి అలాంటి మెగాస్టార్ మెచ్చిన హీరో ఎవరు? అలాంటి హీరోని చిరంజీవి ఇంట‌ర్వ్యూ కూడా చేసారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

ఆయ‌న ఎవ‌రో కాదు. న‌ట భూష‌ణ్ శోభ‌న్ బాబు. ఆంధ్రా అంద‌గాడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు శోభ‌న్ అందించిన సేవ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి లెజెండ‌రీ న‌టుడికి చిరంజీవి వీరాభిమాని. అప్ప‌ట్లో చిరంజీవి ఆయ‌న్ని ఓ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ కూడా చేసిన‌ట్లు తెలుస్తోంది. చిరంజీవి అడిగిన ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు శోభన్ బాబు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు చెప్పారు.

గ‌ర్వం మ‌నిషికి ఎందుకొస్తుంది అంటే? దానికి శోభ‌న్ బాబు ప‌డిపోవ‌డానిక‌ని బధులిచ్చారు. అసూయ ద్వేషం, ప‌గ‌-ప్ర‌తీకారం లాంటి శ‌త్రువుల‌ను ముందు జ‌యిస్తే బాహ్యా శ‌త్రువుల‌ను జ‌యించొచ్చు అన్నారు. కోపం వ‌చ్చిన‌ప్పుడు ఏం చేస్తారు? అంటే... ఎవ‌రో ఒక‌రిపై ఒక నిమిషం గొంతు చించుకుని అరిచేస్తా అన్నారు. అయితే ఆ కోపం ఆరు నెల‌ల‌కు ఒక‌సారి మాత్ర‌మే వ‌స్తుంద‌ని..అస్త‌మాను రాద‌న్నారు.

అలాగే న‌వ్వితే అంతా న‌వ్వుతారు...ఏడిస్తే మాత్రం ఒక్క‌డే ఏడాల్సి ఉంటుంద‌న్నారు. సినిమా అంటే రంగుల మాయా ప్రపంచం. న‌మ్మ‌క ద్రోహం గురించి ఏమంటారు? న‌మ్మ‌డం మ‌న త‌ప్పై తే ద్రోహం చేయ‌డం అవ‌తలి వారి ధ‌ర్మం. డ‌బ్బు మ‌నిషి జీవితానికి క‌చ్చితంగా అవ‌స‌రం. ఎంత ఉంటే అంత మంచిది. అందుకే డ‌బ్బును జాగ్ర‌త్త ప‌రుచుకోవాల‌ని చెబుతా అంటూ ఇలా చిరంజీవి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జవాబులిచ్చారు.

Tags:    

Similar News