మెగా 157.. బడ్జెట్ ఆ రేంజ్ లోనే!

మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు

Update: 2023-08-23 04:14 GMT

మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రాన్ని చిరంజీవి చేయబోతున్నారు. చివరిగా ఇలాంటి దైవిక కాన్సెప్ట్ తో మెగాస్టార్ అంజి మూవీ చేశారు. అయితే ఆ సినిమా రిలీజ్ టైమింగ్ ఇష్యూ, అలాగే చాలా సంవత్సరాల పాటు ఆగిపోయి రిలీజ్ కావడంతో పెద్దగా సక్సెస్ కాలేదు.

అయితే అంజి సినిమా ఈ జెనరేషన్ లో చూసిన వారికి బాగా కనెక్ట్ అవుతుంది. సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్ డ్రాప్ లో ఆ మూవీ కథ ఉంటుంది. అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో అంజి సినిమాని ఆవిష్కరించారు. మరల ఇన్నేళ్ల తర్వాత సోషియో ఫాంటసీ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బింబిసారాతో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ మల్లిడి చిరంజీవిని మెప్పించి సెట్స్ పైకి ప్రాజెక్ట్ తీసుకొని వెళ్తున్నారు.

యూవీ క్రియేషన్స్ ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాలు అన్ని ప్రభాస్ తోనే చేశాయి. రన్ రాజా రన్ సినిమాతో ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన యూవీ తరువాత ప్రభాస్ తో మిర్చి, సాహో, రాధేశ్యామ్ సినిమాలు నిర్మించింది. ఒక్క రాధేశ్యామ్ తప్ప మిగిలిన రెండు లాభాలు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాని ఈ బ్యానర్ ప్రేక్షకులకి అందిస్తోంది.

ఇప్పుడు మెగాస్టార్ 157వ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 120 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారంట. ఒక దర్శకుడికే 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కూడా 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మిగిలింది ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ తో పాటు మూవీ కోసం స్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తర్వాత యూవీ ఈ స్థాయిలో బడ్జెట్ మెగాస్టార్ చిరంజీవి మీద మాత్రమే పెడుతున్నారు. కంప్లీట్ కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న మూవీ కావడం, పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతూ ఉండటం కచ్చితంగా సినిమా ఈజీగా పెట్టిన పెట్టుబడి రిలీజ్ కి ముందే కలెక్ట్ చేసేస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News