మెగాస్టార్ నెక్స్ట్ డైరెక్టర్.. అతను కూడా డేంజరే!?
భోళా శంకర్ సినిమా దెబ్బతో ఇప్పుడు మెగాస్టార్ రీమేక్ సినిమా చేసే ఆలోచనలో అయితే లేడు
కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన సినిమాలు ఒకప్పుడు బాగానే సక్సెస్ అయ్యేవి కానీ ఇప్పుడు కొత్త తరహా కంటెంట్ జనాల మైండ్ సెట్ ను మొత్తంగా మార్చేసింది. భోళా శంకర్ సినిమా దెబ్బతో ఇప్పుడు మెగాస్టార్ రీమేక్ సినిమా చేసే ఆలోచనలో అయితే లేడు. అతను నెక్స్ట్ సినిమాను డాడీ బ్రో అనే కథ ఆధారంగా ఉంటుంది అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
నిజానికి దాని యొక్క రైట్స్ కూడా తీసుకున్నారు. అయితే మెగాస్టార్ మాత్రం ఇప్పుడు దాన్ని రీమేక్ చేయడానికి ఇష్టపడడం లేదు. మళ్లీ సరికొత్త కథను సిద్ధం చేయాలి అని దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా అంత డిఫరెంట్ సినిమాలు ఏమీ ఇప్పటివరకు చేయలేదు.
దాదాపు అతను కూడా మెహర్ రమేష్ తరహాలోనే అనే ఫీలింగ్ కూడా వస్తోందిని అంటున్నారు. ఎందుకంటే మొదట్లో చేసిన సోగ్గాడే చిన్నినాయన పూర్తిస్థాయిలో కమర్షియల్ మూవీ. కథ కొత్తదే అయినా అందులో కమర్షియల్ యాంగిల్స్ చాలానే ఉన్నాయి. చాలా సేఫ్ జోన్ లో కథను డీల్ చేయడం వలన సంక్రాంతి హడావిడిలో సినిమాకు బాగానే కలిసి వచ్చింది.
అలాగే ఆ తర్వాత రారండోయ్ వేడుక చూద్దాం కూడా పరవాలేదు అనిపించింది. కానీ కమర్షియల్ ఫార్మాట్లో కొరటాల లాంటి దర్శకుడికే కోలుకోలేని దెబ్బ పడింది. ఇక కళ్యాణ్ కృష్ణ కూడా అదే ఫార్మాట్లో వెళ్లి రవితేజతో 'నేల టికెట్' అనే సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా కూడా ఆ లెవెల్లో మరో ఆచార్య అని చెప్పవచ్చు. ఇక మరో సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు కూడా అంతగా క్లిక్ కాలేదు.
ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఈ దర్శకుడు మళ్ళీ కమర్షియల్ యాంగిల్ లోనే సినిమాలు చేస్తాడు అనిపిస్తుంది. మెగాస్టార్ నుంచి ఆడియన్స్ ఆ తరహా కథలను ఇంకా కోరుకోవడం లేదు. కొంచెం కమల్ హాసన్ రజినీకాంత్ ఎలాగైతే వారి స్టైల్ లో మార్చుకొని చేస్తున్నారో అదే తరహాలో మెగాస్టార్ కూడా వర్క్ చేస్తే బెటర్ అని చెబుతున్నారు. మరి మెగాస్టార్ ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.