యువతరం సహకరించాలి!
డ్రగ్స్ రహిత సమాజం మనకు కావాలని, దీనికోసం తెలంగాణ ప్రభుత్వానికి యువతరం సహకరించాలని .
డ్రగ్స్ తో యువతరం తప్పుదారిపడుతోందని, జీవితాలు నాశనం చేసుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. డ్రగ్స్ రహిత సమాజం మనకు కావాలని, దీనికోసం తెలంగాణ ప్రభుత్వానికి యువతరం సహకరించాలని . అన్నారు. డ్రగ్స్ బాధితులను శిక్షించడం కంటే రక్షించడమే ధ్యేయంగా నార్కోటిక్స్ బృందాలు పని చేస్తున్నాయని చిరంజీవి తెలిపారు. డ్రగ్స్ వినియోగం, కొనుగోళ్లు లేదా అమ్మకాల గురించి తెలిస్తే వెంటనే ఎన్సీబీకి తెలియజేయాలని కూడా యువతరానికి సూచించారు.
డ్రగ్స్ వినియోగం అనేది ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే చూశాం. ఇప్పుడు ఈ దుష్ఠ ఆచారం భారతదేశంలోకి ప్రవేశించి వేగంగా యువతరాన్ని నాశనం చేస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజ్ లలోను డ్రగ్స్ వినియోగం ప్రమాద తీవ్రతను అర్థమయ్యేలా చెబుతోంది. ఓవైపు ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరిస్తున్నా దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ స్వేచ్ఛగా వినియోగిస్తున్నారని నిత్య వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.
అయితే మెగాస్టార్ చిరంజీవి సహా సెలబ్రిటీలు డ్రగ్స్ దుర్వినియోగంపై నిరంతరం ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషించదగిన పరిణామం. టాలీవుడ్ సెలబ్రిటీలు అన్నివేళలా సమాజ శ్రేయస్సును కోరుకుంటారు. కొన్ని దశాబ్ధాలుగా సమాజ సేవలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి పిలుపుతో ఇప్పుడు మెగాభిమానులు కూడా యాక్టివ్ అయ్యారు. డ్రగ్స్ ని నాశనం చేయడంలో ప్రతి ఒక్క మెగాభిమాని ముందుండి ఉద్యమంలా నడిపిస్తారనే ఆశిద్దాం. యువతరమే దేశభవిష్యత్. అందుకే డ్రగ్స్ మహమ్మారీని తరిమి కొట్టాల్సిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి తదుపరి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.