అర్థ‌రాత్రి ప్ర‌క‌ట‌న‌తో ఉలిక్కిప‌డ్డ చిరంజీవి

రెండవ పద్మ పురస్కారం చూసి ఉక్కిరిబిక్కిరి అయిపోయానని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు

Update: 2024-01-26 06:47 GMT

రెండవ పద్మ పురస్కారం చూసి ఉక్కిరిబిక్కిరి అయిపోయానని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు

తెలుగు మాట్లాడే రాష్ట్రాల నుండి పద్మ విభూషణ్ , పద్మశ్రీ అవార్డులు పొందిన ఎనిమిది మందిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి చిరు ఒక‌రు. గత అర్థరాత్రి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడంపై కొణిదెల చిరంజీవి ఆనందంతో కూడిన ఉద్వేగాన్ని ప్ర‌ద‌ర్శించారు. కేంద్రం నుంచి ఈ ప్ర‌క‌ట‌న త‌న‌ను ఎంత‌గా ఉక్కిరిబిక్కిరి చేసిందో తాజా వీడియో వెల్ల‌డిస్తోంది.

X (గతంలో ట్విట్టర్)లో ఒక నిమిషం 17 సెకన్ల వీడియో సందేశంలో మెగాస్టార్ ఇలా వ్యాఖ్యానించారు. ``ఇది ప్రేక్షకులు, స్నేహితులు, బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్ నుంచి బేషరతు ప్రేమ మాత్రమే. నేను ఈ జీవితానికి ఈ క్షణం మీకు రుణపడి ఉన్నాను`` అని అన్నారు. సాధ్యమైన మార్గాల్లో తన కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి తాను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని పేర్కొన్న చిరంజీవి, ఏదీ ఎప్పటికీ సరిపోదని అన్నారు. తన కెరీర్‌లో గత 45 ఏళ్లుగా వెండితెరపై తన సామర్థ్యానికి తగ్గట్టుగా అలరించేందుకు ప్రయత్నించానని చెప్పారు. సంబంధిత సామాజిక, మానవతా కోణాల్లో నిరుపేదలకు సహాయం చేయడానికి తాను ప్రయత్నించానని అన్నారు. చిరంజీవికి ప‌ద్మ‌విభూష‌ణ్ వ‌స్తుంద‌ని కొంత‌కాలంగా మీడియాలో క‌థ‌నాలొస్తున్న నేప‌థ్యంలో మెగా స్టార్ స‌హా మెగా ఫ్యామిలీ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూసింది. అర్థ‌రాత్రి వేళ ప్ర‌క‌ట‌న‌తో ఆ కుటుంబం ఉలిక్కిపాటుకు గురైంది. అంతేకాదు.. ఈ శుభ‌సంద‌ర్భాన్ని మిడ్ నైట్ లోనే మెగా కుటుంబం ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంది.

ఈసారి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేరు కూడా పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఎ వేలు ఆనంద చారి (కళారంగం). సాహిత్యం & విద్యా రంగంలో కేతావత్ సోమ్‌లాల్ మరియు కూరెళ్ల విట్టలాచార్య విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డి.ఉమా మహేశ్వరి కళా (ఆర్ట్‌)రంగంలో సేవ‌ల‌కు గాను పద్మశ్రీని పొందారు.

Full View
Tags:    

Similar News