ఇండియా Vs పాక్ మ్యాచ్ లో మెగా బాస్..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వన్ డే దుబాయ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వన్ డే దుబాయ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అసలే ఛాంపియన్స్ లీగ్ అందులోనూ దాయాదుల మధ్య పోరు అందుకే క్రికెట్ లవర్స్ అంతా కూడా మ్యాచ్ లైవ్ ని వీక్షిస్తున్నారు. ఐతే ఈ మ్యాచ్ కి టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు కొందరు వెళ్లినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా సుకుమార్ తన ఫ్యామిలీతో మ్యాచ్ లైవ్ చూస్తున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక మ్యాచ్ లైవ్ లో మెగా బాస్ మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించారు.
అదేంటి మన టాలీవుడ్ స్టార్స్ అంతా మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లారా అని అనుకోవచ్చు. దుబాయ్ లో ఒక సెలబ్రిటీ మ్యారేజ్ కి టాలీవుడ్ అంతా కదిలింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు పరిశ్రమకు సంబంధించిన చాలా మంది స్టార్స్ ఈ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారు. దుబాయ్ లో ఎలాగు మ్యారేజ్ అటెండ్ అయ్యాం కాబట్టి సరదాగా లైవ్ మ్యాచ్ కూడా చూసేద్దామని ఫిక్స్ అయ్యారు. సుకుమార్ తన ఫ్యామిలీతో ఏకంగా ఇండియా జెర్సీతో మ్యాచ్ వీక్షిస్తుండగా.. మెగా బాస్ చిరంజీవి క్యాప్ గాగుల్స్ పెట్టుకుని మ్యాచ్ చూస్తున్నారు.
ఓ రకంగా దుబాయ్ లో ఈ మ్యాచ్ లైవ్ చూసేందుకు వెళ్లిన మన తెలుగు ఫ్యాన్స్ కు పండగ అని చెప్పొచ్చు. ఓ పక్క భారత్ పాక్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉండగా టాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ మ్యాచ్ వీక్షించేందుకు రావడం సర్ ప్రైజింగ్ గా ఉంది. ఛాంపియన్స్ ట్రోపీ లో భాగంగా లీగ్ మ్యాచ్ లో ఇండియా ఆల్రెడీ బంగ్లాదేశ్ మీద ఒక మ్యాచ్ గెలవగా నేడు పాకిస్తాన్ తో ఆడుతుంది.
ఈ మ్యాచ్ ని చూసేందుకు ఇప్పటికే అందరు టీవీలకు అతుక్కుపోగా మధ్య మధ్యలో మన స్టార్ హీరో చిరంజీవి తళుక్కున మెరవగా ఫ్యాన్స్ అంతా కూడా షాక్ అవుతున్నారు. క్రికెట్ తో పాటు మన అభిమాన తారలు కూడా ఈ మ్యాచ్ లైవ్ చూసేందుకు వెళ్లడం ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ప్రస్తుతానికి లైవ్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కనిపించారు. ఇంకా హీరోలు ఎవరైనా వచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.