మెగాస్టార్ కోసం భీమ్స్ నే దించుతున్నాడా?
మరి ఈ సినిమాకి సంగీతం అందించేది ఎవరు? అంటే మళ్లీ బీమ్స్ పేరే తెరపైకి వస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి 'విశ్వంభర' పూర్తి చేసిన తర్వాత అనీల్ చిత్రాన్నే పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికే అనీల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నెమ్మదిగా మొదలు పెట్టాడు. ఓ వైపు 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ సెలబ్రేషన్లకు హాజరవుతూనే మరోవైపు చిరు సినిమా పనుల్లోనూ బిజీ అయ్యాడు. దీనిలో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులపై దృష్టి పెట్టాడు. మరి ఈ సినిమాకి సంగీతం అందించేది ఎవరు? అంటే మళ్లీ బీమ్స్ పేరే తెరపైకి వస్తోంది.
అనీల్ రాజుకున్న కథకి..మెగాస్టార్ ఇమేజ్ కి బీమ్స్ అయితే పర్పెక్ట్ గా సెట్ అవుతుందని అనీల్ భావిస్తున్నాడుట. ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని భీమ్స్ మ్యూజికల్ గా సెన్షేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నుంచే బీమ్స్ మాంచి ఫాంలోనూ ఉన్నాడు. దీంతో చిరు సినిమాకి అతడైతే కరెక్ట్ అని అనీల్ బలంగా నమ్ముతున్నాడుట. అయితే ఈ విషయం ఇంకా చిరంజీవి దృష్టికి తీసుకెళ్లనట్లు సమాచారం.
చిరంజీవి సినిమాకి సంగీతం అంటే ఆషామాషీ కాదు. చిరు లో గ్రేస్ ను పట్టుకుని ట్యూన్స్ కంపోజ్ చేయాలి. అవి మాస్ ని అలరించేలా ఉండాలి. చిరంజీవి ఇమేజ్ ని మ్యాచ్ చేయాలి. ఈ విషయంలో చిరంజీవి భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఆయన ఫైనల్ చేస్తే తప్ప! ఎవరూ తుది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. సంక్రాంతి సినిమా కంటే ముందు బీమ్స్ చాలా సినిమాలకు హిట్ ఆల్బమ్స్ అందించాడు.
సినిమాలు ఫెయిలైనా మ్యూజికల్ గా తాను సక్సెస్ అయ్యాడు. మ్యాడ్, టిల్లు స్క్వేర్ లాంటి యూత్ పుల్ సబ్జెక్ట్ లకు వాళ్ల పల్స్ పట్టుకుని ట్యూన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తోన్న 'మాస్ జాతర', అడవి శేషు 'డెకాయిట్' చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరు కూడా భీమ్స్ ని రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువే.