గ్రాఫిక్స్- VFX బడ్జెట్‌లో రాజీ అన్నదే లేదు!
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి చిత్రానికి వీఎఫ్ఎక్స్ - సీజీఐ వర్క్ పనితనం చూసాం.
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, కేవలం VFX కోసమే 230 కోట్లు ఖర్చయిందని కథనాలొచ్చాయి. ఇప్పటివరకూ భారతదేశంలో ఇలాంటి మరొక సినిమా లేనే లేదు. అలాగే వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత భారతీయ సినిమాలో ఎంతగా పెరిగిందో అర్థమైంది. కల్కి సీక్వెల్ కోసం అంతకుమించి సీజీఐ- వీఎఫ్ఎక్స్ కోసం బడ్జెట్ వెచ్చించాల్సి ఉంటుంది. సౌత్ లో తెరకెక్కిన బాహుబలి- బాహుబలి 2- రోబో-2.0 వంటి చిత్రాలకు భారీ వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి చిత్రానికి వీఎఫ్ఎక్స్ - సీజీఐ వర్క్ పనితనం చూసాం.
ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర కోసం సీజీఐ-వీఎఫ్ఎక్స్ కోసం భారీ బడ్జెట్ ని వెచ్చించారని తెలుస్తోంది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర ద్వితీయార్థం పూర్తిగా సీజీఐ ఆధారంగా రూపొందుతోందని టాక్. వరల్డ్ క్లాస్ CGI వర్క్ అవసరమయ్యే ప్రత్యేక షాట్ లు ఉన్నాయి. వీటి కోసం నిర్మాతలు రూ. 12 కోట్లు వెచ్చిస్తున్నారని తెలిసింది. ఇంతకుముందు రోహిత్ శెట్టి సింగం ఎగైన్ క్లైమాక్స్ కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేస్తున్నాడని ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన క్లైమాక్స్ అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇక్కడ `విశ్వంభర`లో కేవలం ఒక్క వీఎఫ్ఎక్స్ షాట్ కోసమే 12 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఇది అంతకంటే చాలా గొప్ప.
`బింబిసార`తో సక్సెస్ అందుకున్న మల్లిడి వశిష్ఠ మెగాస్టార్‌కి సోషియో ఫాంటసీ కథాంశాన్ని వినిపించి దానిని ఓకే చేయించుకోవడం ఒక గొప్ప ఛాలెంజ్ అనుకుంటే... ఇప్పుడు భారీతనం నిండిన వీఎఫ్ఎక్స్‌తో పని చేయడం మరో రకరమైన ఛాలెంజ్. ఇటీవల ఆడియెన్ చాలా మారారు. సాంకేతికంగాను లోపాల్ని సులువుగా కనిపెట్టేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ వర్క్ కానీ ఏం తేడా ఉన్నా సోషల్ మీడియాల్లో విమర్శిస్తున్నారు. అందువల్ల మేకింగ్ లో ఎర్రర్ అన్నది లేకుండా చిత్రీకరణను సాగించాల్సి ఉంటుంది. విశ్వంభర కోసం దర్శకుడు వందశాతం ఎఫర్ట్ పెడుతున్నారని తెలుస్తోంది. బడ్జెట్ పెరిగినా కానీ, దానికి తగ్గ క్వాలిటీ కోసం శ్రమిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయిక. కునాల్ కపూర్, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి బరిలో విడుదల కానుంది.