చిరంజీవి-సురేఖ విదేశాల్లో అడ్వెంచర్ ట్రిప్!
మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు కొంతకాలంగా వెకేషన్ల జోరు పెంచిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు కొంతకాలంగా వెకేషన్ల జోరు పెంచిన సంగతి తెలిసిందే. `ఆచార్య` దగ్గర నుంచి ఈ జోడీ తరుచూ విదేశీ ప్లైట్ ఎక్కడం తరుచూ కనిపిస్తుంది. వెకేషన్లతో పాటు బంధువుల పెళ్లిళ్లు..ఈవెంట్లు...ఇతర శుభకార్యాలున్నా జంటగా తప్పక హాజరవుతున్నారు. అప్పుడప్పుడు షూటింగ్ సమయంలోనూ చిరంజీవి తో పాటు సురేఖని కూడా వెంట తీసుకెళ్తున్నారు. కొంత కాలంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
చీటికి..మాటికి అమెరికా ప్లైట్ ఎక్కిన సందర్భాల్లో ఎక్కువగా చూసాం. అయితే ఈసారి మాత్రం చిరు-సురేఖ జోడీ సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి వెకేషన్ ఓ అడ్వెంచర్ ట్రిప్ గా ఉండాలని భావిస్తున్నారుట. అందుకు ఇప్పటికే ఓ లొకేషన్ ని కూడా స్పాట్ చేసి పెట్టినట్లు సమాచారం. వేసవి ఎండలు ముదరడంతో చిరంజీవి విశ్వంభర షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. తాజా షెడ్యూల్ కూడా పూర్తవ్వడంతో నెల రోజుల పాటు విరామం ప్రకటించినట్లు సమాచారం.
ఏప్రిల్ లో యూరప్ కి వెళ్లబోతున్నట్లు సమాచారం. యూరప్ ఆ జోడీకి కొత్తేం కాదు. గతంలో చాలా సందర్భాల్లో వెళ్లొచ్చారు. అయితే అదంతా షూటింగ్ సమయంలో చిరంజీవి-సురేఖ వెళ్లారు. ఇద్దరూ ప్రత్యేకంగా ప్లాన్ చేసి వెళ్లింది లేదు. ఈ నేపథ్యంలో తాజా వెకషన్ లో భాగంగా ఇంత వరకూ చూడని సరి కొత్త లొకేషన్లు చూడబోతున్నారుట. ఈ ట్రిప్ ఓ గొప్ప అనుభూతిని ఇచ్చేలా స్పెషల్ గా ప్లాన్ చేసుకుం టున్నారుట.
మరి యూరప్ లో ఎలాంటి ప్రదేశాలు చుట్టేయనున్నారు? అన్నది చూడాలి. వెకేషన్ షురూ అయితే సోషల్ మీడియాలో చిరు సైతం అంతే యాక్టివ్ అయిపోతారు. అక్కడ అనుభవాలు..అనుభూతుల న్నింటినీ నెట్టింట వేదికగా అభిమానులతో తప్పక పంచుకుంటున్నారు. అంతవరకూ వెయిట్ అండ్ సీ.