సైరా తరువాత.. మళ్ళీ ఇప్పుడిలా..

మూవీ కోసం యూవీ క్రియేషన్స్ ఏకంగా 170 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Update: 2023-09-11 16:30 GMT

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ అయిన మూవీ అంటే వాల్తేర్ వీరయ్య మాత్రమే. మిగిలిన సినిమాలు అన్ని కూడా పెట్టిన పెట్టుబడి రాబట్టడానికి కూడా అవస్థలు పడ్డాయి. ఖైదీ 150 మూవీ తక్కువ బడ్జెట్ తో చేయడం వలన కొంత సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది. అయితే సైరా నరసింహారెడ్డి బాగుందనే టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో రాలేదు.

గాడ్ ఫాదర్ కూడా ఏవరేజ్ అయ్యింది. ఆచార్య, భోళా శంకర్ సినిమాలు అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గామారాయి . ఈ సినిమాలపై వంద కోట్లు దాటి బడ్జెట్ పెట్టారు. అయితే థీయాట్రికల్ రైట్స్ విషయంలో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. ఇక కలెక్షన్స్ పరంగా అంటే అందరికి తెలిసిందే. అయితే రీమేక్ కథలతో మూవీస్ చేయడం వలన రిజల్ట్ నెగిటివ్ గా వచ్చినట్లు మెగాస్టార్ భావిస్తున్నారంట.

దీంతో కంప్లీట్ గా కొత్త కథతో అది కూడా జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ కథతో వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుంది. సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరో సారి హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం చేస్తున్నారంట. మూవీ కోసం యూవీ క్రియేషన్స్ ఏకంగా 170 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ తక్కువగానే ఛార్జ్ చేస్తున్న ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ మూవీ బడ్జెట్ ఎక్కువ అవుతుందంట. సైరా నరసింహరెడ్డి సినిమాపై రామ్ చరణ్ భారీ బడ్జెట్ పెట్టారు. అయితే మూవీ బాగున్నా కూడా బడ్జెట్ పరిమితులు దాటిపోవడంతో లాభాలు రాలేదు. అయితే మెగా 157 సినిమా విషయంలో కాస్ట్ కటింగ్ చేసిన కూడా 170 కోట్ల వరకు లెక్క తేలుతుందంట.

అయితే కంటెంట్ లో దమ్ముండటంతో యూవీ నిర్మాతలు అంత బడ్జెట్ పెట్టడానికి సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. మరి సైరా తర్వాత మరోసారి భారీ బడ్జెట్ తో మెగాస్టార్ చేస్తోన్న ఈ చిత్రం రిస్కీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అయితే మెగాస్టార్ ఛరిష్మాతో మూవీకి బిజినెస్ జరిగే అవకాశం ఉంటుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News