చిరు డెడికేషన్ కు హ్యాట్సాఫ్.. అందుకేగా మెగాస్టార్ అనేది
మెగాస్టార్ చిరంజీవి అంటేనే డెడికేషన్. ఆ డెడికేషన్ తోనే ఎంతో కష్టపడి స్వయంకృషితో పైకొచ్చారాయన.
మెగాస్టార్ చిరంజీవి అంటేనే డెడికేషన్. ఆ డెడికేషన్ తోనే ఎంతో కష్టపడి స్వయంకృషితో పైకొచ్చారాయన. ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ కొడుకైన కొణిదెల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు. ఇండస్ట్రీకి వచ్చే ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తిగా నిలిచారు.
ప్రస్తుతం చిరంజీవి వయస్సు 68 సంవత్సరాలు. నిజం చెప్పాలంటే ఈ వయసులో జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ చేయడం, కండలు పెంచడం చాలా కష్టం. కానీ, చిరంజీవి చేస్తున్నారు. సినిమాలో తాను చేసే పాత్ర కోసం బాడీలో మాడ్యులేషన్ ను తీసుకురావడానికి కష్టపడుతున్నారు. అదీ చిరంజీవి డెడికేషన్ అంటే.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో భారీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బియాండ్ యూనివర్స్ అంటూ కొత్త కథతో రాబోతున్నారు వశిష్ఠ. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. త్వరలోనే చిరంజీవి విశ్వంభర షూట్ లో జాయిన్ అవ్వనున్నారు.
తాజాగా మెగాస్టార్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. విశ్వంభర కోసం రెడీ అవుతున్నానంటూ జిమ్ లో కష్టపడుతున్న వీడియోను పంచుకున్నారు. సినిమా కోసం చిరంజీవి జిమ్ లో బాగా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. జిమ్ లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్నారు చిరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి జిమ్ లో కష్టపడటం చూసి 68 ఏళ్ల వయసులో ఇలా కసరత్తులు చేయడమంటే మామూలు విషయం కాదని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారని, ఎంతైనా కష్టపడతారని చెబుతున్నారు. అందుకేగా టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారంటూ అభినందిస్తున్నారు.
మరోవైపు, మెగాస్టార్ ఇటీవల పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఎవరో ఒకరు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ను అభినందిస్తూనే ఉన్నారు. త్వరలోనే చిరంజీవిని అభినందిస్తూ ఓ సన్మాన సభ టాలీవుడ్ తరపున చేయనున్నారు.