ఇదేం అభిమానం రా అయ్యా.. ఏకంగా గూగుల్ మ్యాప్స్ లో చిరు లుక్
మొత్తం 800 కిలోమీటర్ల చెక్ పాయింట్స్ పెట్టుకుని జీపీఎస్ నావిగేషన్ సాయంతో వాహనాల ద్వారా ప్రయాణించి వాటిని కలుపుతూ చిరు బొమ్మను గూగుల్ మ్యాప్స్‌పై చిత్రీకరించారు.
క్రేజ్‌లోనూ, ఫ్యాన్ బేస్ లోనూ ఎవరెస్ట్ రేంజ్‌ను అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయన గూగుల్ మ్యాప్స్ కు కూడా ఎక్కేశారు. తనపై ఫ్యాన్స్ లో ఉన్న అభిమానానికి హద్దులు లేవంటూ మరో సారి నిరూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. మెగాఫ్యాన్స్ వినూత్న రూపంలో చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో మెగాస్టార్ ముఖాకృతిని పోలేలా స్పెషల్ రూట్ మ్యాప్ ను తయారు చేసి ఔరా అనిపించారు. మొత్తం 800 కిలోమీటర్ల చెక్ పాయింట్స్ పెట్టుకుని జీపీఎస్ నావిగేషన్ సాయంతో వాహనాల ద్వారా ప్రయాణించి వాటిని కలుపుతూ చిరు బొమ్మను గూగుల్ మ్యాప్స్‌పై చిత్రీకరించారు.
ఈ అరుదైన ఫీట్ కోసం ఏకంగా 15 రోజులు గ్రౌండ్ వర్క్ చేశారు. 'భోళాశంకర్' సినిమా రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ కు ఈ అద్భుతమైన గిఫ్ట్ ను అందించి తమ అభిమానాన్ని చాటుకున్నట్లు తెలిపారు మెగా ఫ్యాన్స్. రీసెంట్ గా కూడా మెగాస్టార్ ఫ్యాన్స్.. ఏకంగా 126 అడుగుల భారీ కటౌట్‌ను సైతం ఏర్పాటు చేసిన ఔరా అనిపించారు. టాలీవుడ్ లో ఓ హీరోకు ఇంతటి భారీ రేంజ్ కటౌట్ ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కాగా, మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య వారధిగా నిలిచారు. రాజకీయాల్లోనూ ఎత్తుపల్లాలు చూశారు. బ్లడ్ బ్యాంక్ వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో చెరగని ముద్ర వేశారు. తన సేవా దృక్పథంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. రీఎంట్రీలో 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య' వంటి సూపర్ హిట్స్ అందుకున్న ఆయన తాజాగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్'తో ఆగస్ట్ 11న ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుని మెగా ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచింది.