కార్ వ్యాన్ కోసం పట్టుబట్టిన స్టార్ హీరో..!
రజినికాంత్ సార్ కి ఒక బాడీ గార్డ్ ఉన్నప్పుడే తనకు ఐదుగురు గార్డ్స్ దాకా రక్షణగా ఉన్నారని అన్నారు. కార్ వ్యాన్ కావాలని చెప్పి పట్టుబట్టి మరీ తెప్పించుకున్నానని అన్నారు విక్రం.
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రం ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ సినిమా ఈమధ్యనే రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సక్సెస్ ఫుల్ జోష్ లో విక్రం కూడా ఖుషిగా ఉన్నాడు. ఈ క్రమంలో తన కెరీర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు విక్రం. తమిళంలో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన విక్రం యాక్టర్ అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఐతే స్టార్ అయ్యే క్రమంలో మొదటి సారి తనకు ఒక కార్ వ్యాన్ కావాలని డిమాండ్ చేశానని అన్నారు విక్రం.
ఆ టైం లో ఎవరికీ కార్ వ్యాన్ లేదు. రజినికాంత్ సార్ కూడా వ్యానిటీ వ్యాన్ వాడట్లేదు. కానీ ఆ టైం లోనే నాకు కార్ వ్యాన్ కావాలని పట్టుబట్టానని చెప్పారు విక్రం. అంతేకాదు సెట్ లోకి అడుగు పెట్టగానే తానొక స్టార్ అని గర్వంగా ఫీల్ అవుతానని.. రజినికాంత్ సార్ కి ఒక బాడీ గార్డ్ ఉన్నప్పుడే తనకు ఐదుగురు గార్డ్స్ దాకా రక్షణగా ఉన్నారని అన్నారు. కార్ వ్యాన్ కావాలని చెప్పి పట్టుబట్టి మరీ తెప్పించుకున్నానని అన్నారు విక్రం.
అంతేకాదు తానెంత స్టార్ అయినా ఫ్యాన్స్ చుట్టుముట్టినప్పుడు అసలేమాత్రం ఇబ్బంది పడనని అన్నారు. వారు చూపించే ప్రేమ అభిమానం కోసమే ఎంతైనా శ్రమించాలని అనిపిస్తుంది. స్టార్ హోదాని ఎంత ప్రేమిస్తానో అలానే సింపుల్ లైఫ్ స్టైల్ ను ఇష్టపడతానని అన్నారు విక్రం. ఇక కాస్త పాపులర్ అయ్యాక స్నేహితులను ఏర్పరచుకోవడం కష్టమని.. ఐతే లైఫ్ లో ఎప్పటినుంచో ఉన్న వాళ్లు ఎవరైతే ఉంటారో వాళ్లే మనకు అసలైన స్నేహితులను అన్నారు విక్రం.
సెట్ నుంచి ఇంటికి వెళ్తే ఎవరికీ అందుబాటులో ఉండనని.. ఇంటికి వెళ్తే ప్రపంచం మారుతుంది. అలానే ఒక్కసారి సెట్ లోకి అడుగు పెడితే ఇంట్లో వాళ్లు మాట్లాడాలనుకున్నా అసిస్టెంట్ కు కాల్ చెయాల్సిందే అని అన్నారు విక్రం. సౌత్ లో అపరిచుతుడు సినిమాతో సెన్సేషనల్ క్రేజ్ తెచ్చుకున్న విక్రం రీసెంట్ గా వచ్చిన తంగలాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించారు. విక్రం తంగలాన్ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోత్తు ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. తంగలాన్ సినిమాలో సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని చెప్పగా చియాన్ ఫ్యాన్స్ ఈ సీక్వెల్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.