లైవ్‌లో బుమ్రాకు సారీ చెప్పిన అంతర్జాతీయ గాయకుడు
రెండు రోజుల్లో రెండోసారి కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్ ముంబైలో తమ కచేరీని నిలిపివేసి, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఘనస్వాగతం పలికారు.
రెండు రోజుల్లో రెండోసారి కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్ ముంబైలో తమ కచేరీని నిలిపివేసి, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఘనస్వాగతం పలికారు. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన వారి రెండవ ప్రదర్శనలో 2024 హోమ్ సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేసిన క్లిప్‌ను ప్లే చేస్తూ మార్టిన్ అతడికి అంతిమ నివాళి అర్పించారు.
శనివారం ముంబైలో జరిగిన ప్రారంభ కచేరీలో వీక్షకుల్లో ఉత్సాహం పెంచేందుకు మార్టిన్ బుమ్రా గురించి ప్రస్థావించాడు. తెరవెనుక ఉన్న బుమ్రా తనపై బౌలింగ్ చేయాలనుకున్నందున షోను ఆపమని కోరాడని మార్టిన్ అన్నాడు. అయితే ఇది అబద్ధం.. అని ఆ తర్వాత సారీ అంటూ క్షమాపణ కోరాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ బుమ్రాపై గౌరవంతో ఈ క్లిప్ ని ప్లే చేస్తున్నామని తెలిపాడు. ఈరోజు బుమ్రా మాకు ఒక సీరియస్ మెసేజ్ పంపాడు. మీ షోలలో నా గురించి మాట్లాడటానికి నేను మీకు అనుమతి ఇవ్వలేదు. నేను ప్రపంచంలోనే గొప్ప బౌలర్‌ని.. అని అన్నాడు. కాబట్టి ప్రపంచంలోనే నంబర్ వన్ అయిన జస్ప్రీత్ పై గౌరవం, ప్రేమతో.. భారతదేశం ఇంగ్లాండ్‌ను కిల్ చేస్తున్న ఈ క్లిప్‌ను మీకు చూపించడం ద్వారా మేం అతడికి ప్రేమను పంపుతున్నాము`` అని చెప్పాడు. మొదటి రోజు షోలో బుమ్రా గురించి ప్రస్థావిస్తూ సరదాగా జోక్ చేసిన అతడు రెండో రోజు క్షమాపణలు కోరుతూ, బుమ్రా క్లిప్ ని ప్రసారం చేయడం ద్వారా ప్రేమను పంపుతున్నామని ఇంగ్లండ్ కే చెందిన గాయకుడు కోల్డ్ ప్లే మార్టిన్ అన్నారు. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి గాయపడిన బుమ్రా సిద్ధమా కాదా? అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది. జనవరి ప్రారంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ సందర్భంగా భారత పేసర్ బుమ్రాకు వెన్నునొప్పి వచ్చింది. దీంతో సిడ్నీ టెస్ట్ మధ్యలో అతడిని ఆసుపత్రికి తరలించారు. గాయం స్థాయిపై బీసీసీఐ వైద్య బృందం ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. బుమ్రా వీపుపై వాపు ఉందని దీని కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని కోరినట్లు సమాచారం. బుమ్రా గాయంతో సంబంధం లేకుండా సెలెక్టర్లు అతనిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు.