యానిమల్ నిర్మాతలతో కబీర్ సింగ్ నిర్మాత ఫైట్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' 2023లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' 2023లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 'కబీర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ తో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. యానిమల్, కబీర్ సింగ్.. ఇరు సినిమాల విజయాల్లో సందీప్ రెడ్డి వంగా కీలక వ్యక్తి. కానీ ఇప్పుడు యానిమల్ నిర్మాతలపై కబీర్ సింగ్ నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. 'యానిమల్' OTT విడుదలపై స్టే కోరుతూ కబీర్‌సింగ్ నిర్మాతలు డిల్లీ హైకోర్టుకు వెళ్లారు.
కబీర్ సింగ్ నిర్మాణ సంస్థ సినీ1 స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ యానిమల్ నిర్మాణ సంస్థ అయిన T-సిరీస్‌పై కేసు వేసింది. రెండు ప్రొడక్షన్ హౌస్‌లు 'యానిమల్'ని 35 శాతం లాభాల వాటాతో నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయని పేర్కొంది. టి-సిరీస్ ప్రొడక్షన్, ప్రమోషన్ - విడుదల కోసం ఖర్చులు చేసిందని, బాక్సాఫీస్ రాబడిని వసూలు చేసిందని, కానీ ఎలాంటి వివరాలను తమతో పంచుకోలేదని తమకు డబ్బు చెల్లించలేదని స్టూడియో పేర్కొంది.
అయితే ప్రముఖ మీడియా టీసిరీస్ బృందాలతో దీనిపై వివరణ కోరింది. ఇది యానిమల్ విషయంలో T-సిరీస్ అనుసరిస్తున్న సాంప్రదాయ వాణిజ్య పద్ధతి. సాధారణంగా, P&A (ప్రింట్ మరియు అడ్వర్టైజింగ్), OTT చెల్లింపు ఆరు నెలల తర్వాత ఖర్చును రికవర్ చేసిన తర్వాత వస్తుంది. పైగా సినిమా విడుదలై కేవలం ఒకటిన్నర నెలలు మాత్రమే అయ్యింది. లాభాల్లో వాటాలు -భాగస్వామ్య ఒప్పందాన్ని గౌరవించడానికి T-సిరీస్ కట్టుబడి ఉంది. కాబట్టి సినీ1 ఎందుకు తొందరపడుతోంది? కాంట్రాక్ట్ ప్రకారం విడుదలైన 60 రోజుల తర్వాత వివరణలతో కూడిన ప్రకటన వస్తుంది. కానీ ఇంకా 60రోజుల సమయం పూర్తి కాలేదు'' అని తెలిపింది.
ఈ కేసు తదుపరి విచారణ గురువారం జరగనుంది. దీనిపై సినీ1 అధినేత మురాద్ ఖేతాని వివరణ ఇవ్వాల్సి ఉంది. యానిమల్ లో రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనిల్ కపూర్, రష్మిక మందన్న తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. విక్కీ కౌశల్ నటించిన 'సామ్ బహదూర్' సినిమాతో పోటీపడుతూ విడుదలైన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొన్ని రికార్డ్ లు బద్దలు కొట్టింది.