పైర‌సీకి పాల్ప‌డితే .. మారిన చ‌ట్టంతో ముప్పుతిప్ప‌లే

తాజాగా సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లు- 2023 ను రాజ్యసభ ఆమోదించింది.

Update: 2023-07-29 11:04 GMT

సినిమాల‌కు సెన్సార్ అత్యంత ముఖ్య‌మైన‌ది. అన్ని వివాదాల‌ను ప‌రిష్క‌రించుకున్నాకే ఏదైనా సినిమాకి సెన్సార్ స‌ర్టిఫికెట్ అందుతుంది. తాజాగా సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లు- 2023 ను రాజ్యసభ ఆమోదించింది.

పైరసీ - లైసెన్సింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఈ బిల్లు లక్ష్యం. ఈ బిల్లులో కీల‌కంగా సినిమా స‌ర్టిఫికేష‌న్ లో వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించిన అంశాల‌ను నిర్ధేశించింది.

ఇంత‌కుముందే కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఎగువసభలో బిల్లును సమర్పించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పైరసీ సమస్యను దాని వల్ల సినీ పరిశ్రమకు భారీ నష్టం ఎలా జరుగుతుందనే అంశాన్ని ప్రస్తావించారు.

కొత్త నిబంధనల ప్రకారం పైరసీకి పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష .. సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం వరకు జరిమానా విధించబడుతుంది.

బిల్లు UA ధృవీకరణ మూడు విభాగాలను కూడా నిర్దేశించింది. UA 7+, UA13+, UA16+.. నిర్దేశిత వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరైనా అలాంటి సినిమాని చూడటానికి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం అవసరం. CBFC ఇప్పుడు టెలివిజన్ లేదా ఏదైనా ఇతర మాధ్యమంలో ప్రదర్శిత‌మ‌య్యే చలనచిత్రానికి ప్రత్యేక సర్టిఫికేట్ లను కూడా అందించగలదు.

సినిమాటోగ్రాఫ్ చట్టానికి చివరిసారిగా పెద్ద సవరణ 1984లో జరిగిందనీ దానికి ర‌క‌ర‌కాల కార‌ణాలున్నాయ‌ని మంత్రివ‌ర్యులు ఎగువ‌స‌భ‌లో నొక్కి చెప్పారు. చట్టాలు, కార్యనిర్వాహక ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పులు మొదలైన వాటి మధ్య సమకాలీకరణను సృష్టించడం ద్వారా సినిమాకు లైసెన్స్ ప్రక్రియను మెరుగుపరచడం ఈ బిల్లు అస‌లు లక్ష్యం.

Tags:    

Similar News