విజయ్ కు OG సంకటం!
ఒకవేళ "ఓజీ" నిజంగా మార్చి 27న రాకపోతే, విజయ్ దేవరకొండ సినిమా ప్రశాంతంగా విడుదల అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "ఓజీ" సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. గతంలో వచ్చిన టీజర్ ఒకటే అయినప్పటికీ, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రేడ్ వర్గాల్లో హయ్యెస్ట్ బిజినెస్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగేలా నిర్మాత డివివి దానయ్య 2025 మార్చి 27, విడుదల తేదీని లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ, ఈ తేదీ విజయ్ దేవరకొండ నటిస్తున్న "విడి 12" సినిమాకు చిక్కుగా మారే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న "విడి 12" కూడా మార్చి 28న రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అఫీషియల్‌గా ఈ డేట్ కన్ఫర్మ్ అయ్యింది, దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.
అయితే, ఇప్పుడు "ఓజీ" విడుదల తేదీ మార్చి 27 కాబట్టి, ఈ రెండు సినిమాలు ఒకే వారం రిలీజ్ అవ్వడం, ఫ్యాన్స్ మధ్య పోటీ రావడం ఖాయం. ఇక సినిమా పరిశ్రమలో అందరికి తెలిసిన విషయం ఏంటంటే, నిర్మాత నాగ వంశీ పవన్ కళ్యాణ్‌తో క్లాష్ చేయడానికి ఆసక్తి చూపరు. మరి, "విడి 12" విడుదలపై మళ్లీ ఆలోచన చేయాల్సి వస్తుందా? అనే ప్రశ్న ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చగా మారింది.
త్రివిక్రమ్ కూడా ఈ క్లాష్‌ని తప్పించాలనుకుంటారని సమాచారం. సితార బ్యానర్ లో ఆయన ప్రొడక్షన్ కూడా చాలా కాలంగా భాగస్వామ్యంతో కొనసతున్న విషయం తెలిసిందే. ఒకవేళ "ఓజీ" నిజంగా మార్చి 27న రాకపోతే, విజయ్ దేవరకొండ సినిమా ప్రశాంతంగా విడుదల అవుతుంది. ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా బిజీగా ఉన్న కారణంగా "ఓజీ" షూటింగ్ డేట్లు కాస్త ఇబ్బంది కరంగా మారుతున్నాయి.
పవన్ సినిమాల షెడ్యూల్స్ కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఆయన రాజకీయ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతున్నాయి. అందుకే, "ఓజీ" సినిమా రిలీజ్ విషయంలో ప్లాన్ మరే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా OG షూటింగ్ ముగిసిన తర్వాత మాత్రమే మిగతా సినిమాల విడుదల తేదీల గురించి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్‌లో "విడి 12" అత్యంత ప్రాధాన్యమున్న సినిమా. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇక ఓజీ ప్రస్తుత షెడ్యూల్ లో మార్పులు జరిగితే విడి 12 విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా బాక్సాఫీస్ దద్దరిల్లే అవకాశం ఉంది.