ఆ పాట వద్దు అంటే పవన్ వినలేదు.. అందుకే అలా జరిగిందట..

కొన్ని క్లాసిక్ పాటలు అయితే భాషతో సంబంధం లేకుండా సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకుల మనసులో మెదులుతూనే ఉంటాయి.

Update: 2024-08-31 21:30 GMT

తెలుగు సినిమాలలో స్టోరీకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పాటలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాలో పాటలు ఎంత హిట్ అయితే.. మూవీ అంత బ్లాక్ బస్టర్ అవుతుంది అని అందరూ భావిస్తారు. కొన్ని సందర్భాలలో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు పాటలకు బాగా కనెక్ట్ అయిపోతారు. కొన్ని క్లాసిక్ పాటలు అయితే భాషతో సంబంధం లేకుండా సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకుల మనసులో మెదులుతూనే ఉంటాయి.

అలాంటి పాటలలో పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు’ మూవీ లోని 'ట్రావెలింగ్ సోల్జర్’ సాంగ్ ఒకటి. అయితే ఈ పాట పవన్ కళ్యాణ్ పట్టుపట్టడం వల్ల చిత్రంలో పెట్టారు అన్న విషయం చాలామందికి తెలియదు. 1999లో విడుదలైన తమ్ముడు చిత్రం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనాన్ని సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ పవన్ కెరీర్ లో ఓ మైలురాయిగా మిగిలిపోయింది.

బాధ్యత లేకుండా తిరిగే ఓ యువకుడు తన అన్న కోసం.. తండ్రి కోసం బాక్సింగ్ నేర్చుకొని చాంపియంగా ఎలా మారుతాడు అనే అంశం చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో ప్రతి సన్నివేశం.. ప్రతి పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికే ఈ మూవీ ఓ ట్రెండ్ సెట్టర్.

పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను చూపిస్తూ ఎన్నో సాహసోపేతమైన ఫీట్స్ ను ఈ పాటలో చేశారు. అప్పట్లో ఈ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ పాట ఎంతో ట్రెండింగ్ గా ఉంది. అయితే ఇది ఓ ఇంగ్లీష్ పాట.. అప్పట్లో తెలుగు చిత్రాలలో పూర్తి తరహాలో ఇంగ్లీషు పాటను పెట్టడంపై చిత్ర యోని ఎన్నో అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

ఈ మూవీలో తన బాధ్యత తెలుసుకున్న సుబ్బు అన్న కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవాలని భావిస్తాడు. ఈ నేపథ్యంలో అతని తపన.. కఠోర దీక్షను ఓ పాట రూపంలో చిత్రిస్తే బాగుంటుంది అని తొలత చిత్ర బృందం భావించింది. ఆ సందర్భంలో సంగీత దర్శకుడు రమణ గోగుల తో చర్చించిన పవన్ మూవీలో ఓ ఇంగ్లీష్ పాటను పెడితే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అందరూ ఈ పాటను తెలుగులో పెడితే బాగుంటుంది అని అన్నారట.. కానీ పవన్ మాత్రం ప్రేక్షకులకు భిన్నంగా ఒక మంచి అనుభూతిని అందివ్వాలి అంటే పాట పెట్టి తీరాల్సిందే అని పట్టు పట్టారట. అలా మూవీకి ఓ హైలెట్ పాట పవన్ కారణంగా యాడ్ చేయడం జరిగింది.

Tags:    

Similar News