పూరి-శంకర్ ఫెయిల్యూర్స్ ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారా?
ఎప్పుడూ కథల విషయంలో ఎవరి మీద ఆధారపడిన వారిద్దరు ఇతరులపై ఆధారపడినా సరైన ఫలితాలు రావడం లేదు.
ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ గా నీరాజనాలు అందుకున్న శంకర్-డ్యాషింగ్ డైరెక్టర్ గా పేరొందిన పూరి జగన్నాధ్ ఇప్పుడు ఎలాంటి ఫేజ్ లో ఉన్నారో తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. వాళ్లు తీస్తోన్న సినిమాలు చూస్తుంటే ఇప్పట్లో బౌన్స్ బ్యాక్ అవ్వడం కూడా చాలా కష్టంగానే కనిపిస్తుందనే విమర్శ వినిపిస్తుంది. ఎప్పుడూ కథల విషయంలో ఎవరి మీద ఆధారపడిన వారిద్దరు ఇతరులపై ఆధారపడినా సరైన ఫలితాలు రావడం లేదు.
శంకర్ దర్శకత్వం వహించిన `గేమ్ ఛేంజర్` కి స్టోరీ అందించింది కార్తీక్ సుబ్బరాజ్. సాధారణంగా ఎవరు కథ రాసినా శంకర్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. కానీ గేమ్ ఛేంజర్ స్టోరీ విషయంలో మాత్రం ఆయన వేలు పెట్టలేదు. గుడ్డిగా కార్తిక్ కథని నమ్మి ముందుకెళ్లిపోయాడు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా శంకర్ వివేక్ వేళుమురగన్ పై ఆధారపడ్డారు. మొత్తంగా వెరసి శంకర్ ని తీవ్ర విమర్శల పాలకు గురి కావాల్సి వచ్చింది. సినిమాకి కర్త, కర్మ, క్రియగా అన్ని బాధ్యతలు తనే తీసుకోవాల్సి వస్తోంది. రైటింగ్ విభాగంలో ఆయన ఇన్వాల్వ్ కాకపోయినా శంకర్ కార్నర్ అయ్యారు.
అయితే సుజాత రంగరాజన్ అనే రచయిత ఉన్నంత కాలం శంకర్ కి ఈ పరిస్థితి రాలేదు అన్నది కాదనలేని నిజం. స్క్రిప్ట్ బ్యాకెండ్ లో అతడి వర్క్ కీలకంగా ఉండేది. ఏమోషన్ క్యారీ చేయడంలో ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉండేదంటారు. సుజాత మరణం తర్వాత శంకర్ టేకప్ చేసిన సినిమాలన్నీ వైఫల్యాల బాటలో పయనిస్తున్నాయని మెజార్టీ వర్గం అభిప్రాయం.
ఇక పూరి జగన్నాధ్ తొలిసారి `టెంపర్` కోసం వక్కంతం వంశీపై ఆధారపడాల్సి వచ్చింది. ఆ సినిమా మాత్రం మంచి ఫలితాలే సాధించింది అనుకోండి. ఆ తర్వాత చేసిన సినిమాల్లో `ఇస్మార్ట్ శంకర్` తప్ప ఇంకే సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఇండస్ట్రీకి స్టార్స్ ని అందించిన ఘతన పూరి సొంతం. పూరి చివరి సినిమా `డబుల్ ఇస్మార్ట్`. ఈ సినిమా వైఫల్యం తర్వాత ఇప్పటి వరకూ కొత్త సినిమా ప్రకటించలేదు. మరి ఈ స్టార్ డైరెక్టర్లు ఇద్దరు కంబ్యాక్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తారో చూడాలి.