కాంబినేషన్స్ తో ఇక కష్టమే?
కాంబినేషన్స్ అనేవి ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తేలిపోతున్నాయి. అవి కేవలం ఓపెనింగ్ ల వరకే పరిమిత మవుతున్నాయి.
కాంబినేషన్స్ అనేవి ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తేలిపోతున్నాయి. అవి కేవలం ఓపెనింగ్ ల వరకే పరిమిత మవుతున్నాయి. సినిమాలో బమలైన కథ..ఎమోషన్ లేకపోతే గనుక తొలి షోతోనే సర్దేయాల్సి వస్తోందని ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలు కొన్ని రుజువు చేసాయి. హీరో బొమ్మ చూసి థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ క్రమక్రమంగా తగ్గుతున్నారు. సినిమా లో కంటెంట్ ఏముంది? అది ఎలా ఉంది? అని విశ్లేషించే స్థాయికి ఆడియన్స్ చేరుకున్నారు.
ఇటీవలి కాలంలో చిన్న సినిమాలే కోట్ల వసూళ్లను సాధించాయి. భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ ఆ తరహా చిత్రాల్ని ఎంతగా ఆదరించారు? అన్నది అర్దమైంది. భారీ కాన్వాస్ ..కాస్టింగ్ తో తెరకెక్కిన చిత్రాల్ని సరిపోల్చితే! కాంబినేషన్స్ అనేవి ఎంత ఘెరంగా వైఫల్యం అవుతున్నాయన్నది అద్దం పడుతుంది. దీంతో ఓటీటీలు ముందుగానే అలెర్ట్ అయ్యాయి. మునుపటిలా కాంబినేషన్స్ ఉన్న చిత్రాలకంటే కంటెంట్ ఉన్న చిత్రాల్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ఆదరణ బాగుండటం సహా తక్కువ బడ్జెట్ లోనూ అందుబాటులో ఉంటున్నాయి. వాటి ద్వారా లాభాలు అధికంగా ఉంటున్నాయి. దీంతో నిర్మాతలు అలెర్ట్ అవుతున్నట్లు కనిపి స్తుంది. కాంబినేషన్స్ తో కాదు..సరైన కథల్ని నిర్మించండని అనుభజ్ఞులు ఇంత కాలం చెప్పినా చెవికెక్కించికోని వారంతా ఇప్పుడు అలెర్ట్ అవుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే డిజిటల్..ఓటీటీ బిజినెస్ జరగడం కష్టమవ్వడంతో నిర్మాతలు కథలపైనా ప్రత్యేకంగా కసరత్తులు చేయాల్సి వస్తోంది.
స్టోరీ పక్కాగా ఉంటే ఎంత ఖర్చు చేయడానికైనా సిద్దం. ఆ నమ్మకం మాకివ్వండని దర్శక-హీరోల్ని నేరుగా అడుగుతున్న సన్నివేశం కనిపిస్తుంది. ఈ విధానం మరింత బలంగా అమలులోకి వచ్చిందంటే? నిర్మాత పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లే. ఎలాంటి కథ రాసాం? ఎలా తీస్తున్నాం? అన్నది నిర్మాత ఆలోచిం చడం కాదు. హీరో..దర్శకుల్ని వేడుకోవడం కాదు. నిర్మాత వద్దకు వచ్చిన హీరో-దర్శకుడే ముందుగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నిర్మాతకి భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీటీలు తీసుకొస్తున్న ఈ మార్పు భవిష్యత్ లో ఇంకా బలంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.