ల*గ పనులు.. యాంకర్‌పై అసభ్య వ్యాఖ్య..
రేష్మి సదరు నెటిజన్ వ్యాఖ్యలను ఎదురు ప్రశ్నిస్తూ.. ల*గా పనిలు అంటే ఏమిటి? నేను ఈ పదాలు ఆన్ లైన్ లో షికార్ చేయడం చూస్తున్నాను.
టీవీ హోస్ట్, నటి రష్మీ గౌతమ్ చాలాసార్లు ట్రోలింగును ఎదుర్కొన్నారు. కానీ ఈసారి ఈ ట్రోలింగ్ మరింత జుగుప్సాకరమైనది. రామమందిర ప్రారంభోత్సవం రోజున రష్మిక రూపం ఆహార్యం గురించి ప్రస్థావిస్తూ ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాల్లో చర్చగా మారాయి. ఇవి అసంబద్ధంగా చికాకు పుట్టించాయి. రష్మిక అసభ్యకరమైన షోలు చేస్తోందని కొందరు నెటిజనులు విమర్శించగా ఒక నెటిజన్ `లం*పనులు` అంటూ కామెంట్ చేసాడు. సదరు నెటిజన్ ``అన్ని ల*గ పనులు చెయ్యండి.. కుంకుమపువ్వు చీర కట్టుకొని జై శ్రీరామ్ అనకండి.. అన్ని ల*గ పనులు తుడిడ్చి పెట్టుకుని పోతయి అనుకోకండి`` అని వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ స్లాంగ్. బూతు పదం కూడా.
రేష్మి సదరు నెటిజన్ వ్యాఖ్యలను ఎదురు ప్రశ్నిస్తూ.. ల*గా పనిలు అంటే ఏమిటి? నేను ఈ పదాలు ఆన్ లైన్ లో షికార్ చేయడం చూస్తున్నాను. నేను భగవాన్ చీర ధరించడం లేదా రామనామం జపించడం చాలా మందిని రెచ్చగొట్టింది. భగవాన్ సబ్కే హై .. అది సనాతన్ ధర్మానికి అందం. ఆధ్యాత్మికంగా ధర్మం కర్మల మధ్య సమతౌల్య ప్రక్రియ`` అని రాసారు. నెటిజన్ `ల*గ పనులు అంటూ యాంకర్‌ని కించపరిచాడు. `లంగా పనులు` వ్యాఖ్యకు వ్యతిరేకంగా రష్మీ ప్రతిస్పందన వైరల్ గా మారింది.
``నేను నా బిల్లులు చెల్లించలేదా లేదా నా కుటుంబ బాధ్యత తీసుకోలేదా? నేను వారి కోసం నా తల్లిదండ్రులను రోడ్లపై వదిలేశానా? నేను నా పన్నులు చెల్లించలేదా? నేను ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నానా? నాపై ఏదైనా వసూలు చేశారా? అంటూ సదరు నెటిజన్ కి కౌంటర్ గా ప్రశ్నలను సంధించారు రేష్మి. నిజానికి ఒకరి ఎంపికలను ఇంత దారుణంగా ట్రోల్ చేయడం సరికాదు. వారి ఎంపికలకు ప్రైవసీకి భంగం కలిగించడం సరికాదన్న విశ్లేషణ సాగుతోంది.