ట్రైలర్ టాక్: వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్' థ్రిల్లర్
మరల ఈ ఏడాది డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నాడు.
హీరో వరుణ్ సందేశ్ గత కొంతకాలంగా డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చి తనని తాను స్ట్రాంగ్ తో రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ కొంత గ్యాప్ తర్వాత గత కొంతకాలం నుంచి రెగ్యులర్ గా వరుస సినిమాలతో వస్తున్నాడు. మరల ఈ ఏడాది డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నాడు.
‘కానిస్టేబుల్’ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన హత్యకేసు మిస్టరీని చెందించే కానిస్టేబుల్ గా ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నాడు. ఒక అమ్మాయిని అత్యంత క్రూరంగా హింసించి చంపేసిన వాడి ఆచూకీ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూ హంతకుడిని పట్టుకోవడానికి వరుణ్ సందేశ్ ఎలాంటి ప్రయాణం చేశాడు.
ఈ క్రమంలో అతనికి ఎదురైనా సవాళ్లు ఏంటనేది ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు టీజర్ బట్టి స్పష్టం అయ్యింది. ఆర్యన్ సుభాన్ ఎస్ కె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బలగం జగదీశ్ ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి నటించింది. సూర్య,కల్పలత , మురళీధర్ గౌడ్ కీలక పాత్రలలో నటించారు.
సుభాష్ ఆనంద్, గ్యాని ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ అయితే యుట్యూబ్ లో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. టీజర్ కి మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వరుణ్ సందేశ్ ఇలాంటి కథలతో మూవీస్ చేస్తే కచ్చితంగా మరల బౌన్స్ బ్యాక్ అవుతాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వరుణ్ సందేశ్ కెరియర్ లో ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ గా ఈ ‘కానిస్టేబుల్’ చిత్రంలో కనిపించబోతున్నాడు. అతని లుక్ కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. కచ్చితంగా ఈ సినిమా అతనికి సూపర్ సక్సెస్ ఇస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిన్న సినిమాలుగా వచ్చిన పెద్ద సక్సెస్ లు అందుకుంటున్న మూవీస్ ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తున్నాయి. వాటి తరహాలోనే ఈ చిత్రం కూడా ఆదరణ దక్కించుకుంటుందని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.