బిగ్ బాస్ 8 : నిఖిల్ వర్సెస్ తేజ.. ప్రేరణతో గౌతం ఫైట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో మండే వచ్చింది అంటే నామినేషన్స్ షురూ అయినట్టే.

Update: 2024-11-12 04:01 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో మండే వచ్చింది అంటే నామినేషన్స్ షురూ అయినట్టే. శని ఆదివారాల ఎపిసోడ్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో నామినేషన్స్ డే అంటే సోమవారం ఎపిసోడ్ కూడా అంతే ఎంగేజింగ్ గా ఉంటుంది. నామినేషన్స్ టైం లో కంటెస్టెంట్స్ అంతా ఒకరి మీద మరొకరు గొడవకు దిగితే ఆడియన్స్ దాన్ని భలే ఎంజాయ్ చేస్తారు. ఈసారి నామినేషన్స్ లో యాక్టివిటీ ఏరియాలో కంటెస్టెంట్స్ బొమ్మలు ఉండగా ఎవరైతే ఇంట్లో ఉండటానికి అర్హత లేదని అనుకుంటారో వారి బొమ్మ మీద పెయింట్ వేయాల్సి ఉంటుంది.

మెగా చీఫ్ అవ్వడం వల్ల ప్రేరణకు ముందు ఛాన్స్ ఇచ్చారు ఆమె గౌతం ని నామినేట్ చేస్తూ అతను ఆట సరిగా ఆడట్లేదని. ప్రతిదీ ఆడియన్స్ కు మెసేజ్ ఇస్తున్నట్టుగా ఉందని. తన తప్పుని ఒప్పుకోడని చెప్పింది. దానికి గౌతం కూడా ఆమెకు సమాధానం చెప్పడానికి ట్రై చేశాడు. ఇక రెండో నామినేషన్ నుంచి గార్డెన్ ఏరియాలో ఎవరైతే బ్రష్ తీసుకుంటారో వారికే నామినేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది.

అలా నిఖిల్, తేజ, గౌతం, రోహిణి బ్రష్ అందుకుని నిఖిల్ తేజాని, గౌతం పృధ్విని, తేజ యష్మిని, రోహిణి విష్ణు ప్రియని నామినేట్ చేశారు. నిఖిల్ తేజాని నామినేట్ చేస్తూ నేను చేసింది తప్పైతే యష్మి చేసింది కూడా తప్పేనని వాదించాడు. మరోపక్క తేజ యష్మిని నామినేట్ చేస్తూ ఆమె తో గొడవకు దిగాడు. హౌస్ లో వరస్ట్ ప్లేయర్ అంటూ తేజని అన్నది యష్మి.

అమ్మని హౌస్ లోకి తీసుకు రాలేకపోతున్నందుక్ తేజ తన తల్లికి క్షమాపణ చెప్పాడు. ఇక ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో గౌతం, తేజ, యష్మి, విష్ణు ప్రియ, అవినాష్, పృధ్వి నామినేషన్స్ లో ఉన్నారు. ఈసారి నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరికి రిస్క్ అన్నది ఈ వారం వారు ఆడే ఆటని బట్టి తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం టాప్ 10 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. 14మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ వైల్డ్ కార్డ్ గా మరో 8 మందిని తీసుకొచ్చారు. అంటే 24 మందిలో ఫైనల్ గా టాప్ 10గా వీరు నిలిచారు. మరి వీరిలో టాప్ 5కి ఎవరు చేరుకుంటారు అన్నది చూడాలి.

Tags:    

Similar News