బిగ్ బాస్ 8 : వాళ్ల టార్గెట్ లో ప్రేరణ.. గ్రాఫ్ పెంచేస్తున్నారుగా..!

బిగ్ బాస్ సీజన్ 8 లో మండే వచ్చింది అంటే నామినేషన్స్ హీటు తెలిసిందే.

Update: 2024-10-22 05:55 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో మండే వచ్చింది అంటే నామినేషన్స్ హీటు తెలిసిందే. ప్రతి వారం లానే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఐతే ఈసారి కంటెస్టెంట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి దిష్టి బొమ్మకి కుండ పెట్టి పగలగొట్టాల్సి ఉంటుంది. ఐతే సోమవారం పూర్తిగా హౌస్ మెట్స్ అందరి నామినేషన్స్ చూపించలేదు. పృధ్వి, విష్ణు ప్రియ, రోహిణి, హరితేజ, నబీల్, నయని పావని నామినేషన్స్ మాత్రమే చూపించారు. ఇంకా మిగిలిన వారి నామినేషన్స్ ఈరోజు ఎపిసోడ్ లో చూపిస్తారు.

ఇక జరిగిన నామినేషన్స్ లో పృహ్వి, విష్ణు ప్రియ, నబీల్, నయని పావని, హరితేజ అందరు కూడా ప్రేరణని నామినేట్ చేశారు. పృధ్వి లాస్ట్ వీక్ నామినేషన్స్ లో తనని కిల్లర్ గర్ల్ గా ఉండి నామినేట్ చేసిందని ప్రేరణ మీద రివెంజ్ నామినేషన్ వేశాడు. అతని దారిలోనే ఫుడ్ విషయంలో ప్రేరణ నచ్చందని చెబుతూ విష్ణు ప్రియ ప్రేరణని నామినేట్ చేసింది. మరోపక్క హరితేజ, నయని పావని కూడా ప్రేరణ కిల్లర్ గర్ల్ గా డెసిషన్ సరిగా తీసుకోలేదని నామినేట్ చేశారు.

ఐతే హౌస్ లో కొంతమందికి ప్రేరణ టార్గెట్ అయిందని తెలుస్తుంది. ముఖ్యంగా పృధ్వి అతనితో పాటు విష్ణు ప్రియ ప్రేరణని టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. హరితేజ, నయని పావని కూడా ప్రేరణకి ఇంట్లో ఉండే అర్హత లేదని నామినేట్ చేశారు. నబీల్ మాత్రం అతన్ని ఇమ్మెచ్యూర్ అన్నందుకు నామినేట్ చేశాడు.

ఏది ఏమైనా వీళ్ల టార్గెట్ వల్ల బయట ఆడియన్స్ లో ప్రేరణ గ్రాఫ్ పెరిగేలా ఉంది. పృధ్వి, విష్ణు ప్రియ అసలేమాత్రం పసలేని నామినేషన్స్ వేశారు. హరితేజ కొంతమేరకు బెటర్ అనిపించినా ప్రేరణ విషయంలో ఆమె కూడా కావాలనే చేసింది అన్నట్టుగా అనిపించింది. మరి ఆడియన్స్ ఎవరు ఎలా ఆడుతున్నారు.. ఎవరు ఎలాంటి వారన్నది తెలుసు కాబట్టి ఎవరికి ఓటు వేయాలన్న క్లారిటీ ఉంటుంది. ఐతే వారు నామినేట్ చేస్తూ మాట్లాడిన మాటలకు.. అడిగిన ప్రశ్నలకు ప్రేరణ ఎక్కడ తడబడకుండా సమాధానం ఇస్తుంది. తన దూకుడు చూస్తుంటే టాప్ 5 లోకి దూసుకెళ్లేలానే ఉంది. ఇప్పటి వరకు టాప్ 5 ఎవరన్నది చెప్పడం కష్టమయ్యింది కానీ 8 వారాలు పూర్తయ్యాయి కాబట్టి ఎవరు టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది అన్నది కాస్త అర్థమవుతుంది.

Tags:    

Similar News