సూపర్‌స్టార్ భార్య మతమార్పిడిపై రచ్చ!
బాలీవుడ్ లో సూపర్‌స్టార్ గా తనను తాను ఆవిష్కరించుకున్న షారుఖ్ ఖాన్ ముస్లిం అయితే, గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా సుప్రసిద్ధురాలు.
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా కులమతాల గురించి చర్చ సాగుతోంది. సోషల్ మీడియా యుగంలో వేగంగా కులమత విద్వేషాలు చెలరేగే ప్రమాదం పొంచి ఉంది. సెలబ్రిటీలు కొంత ముప్పును ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మతాంతర ప్రేమ వివాహం చేసుకున్న సూపర్‌స్టార్ షారూఖ్‌కి ఇప్పుడు నింద ఎదురైంది. షారూఖ్ మూడు దశాబ్ధాల సంసార జీవనం అనంతరం తన భార్య గౌరీతో మతమార్పిడి చేయించాడనేది నెటిజనుల అభియోగం. అంతేకాదు గౌరీఖాన్ హిజాబ్ ధరించిన ఓ ఫోటోని వైరల్ చేస్తున్నారు.
షారూఖ్ తన భార్య గౌరీ ఖాన్, పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో కలిసి మక్కాలో ప్రార్థనలు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో గౌరీ నలుపు కుర్తీ , బూడిద రంగు హిజాబ్ ధరించి కనిపిస్తోంది. మరోవైపు కింగ్ ఖాన్ తెల్లటి కుర్తాలో సింపుల్ గా ఉన్నాడు. ఆర్యన్ కూడా వారి వెనుక నిలబడ్డాడు. ఈ ఫోటో వైరల్ కాగానే ఖాన్ కుటుంబం మక్కాలో కొత్త సంవత్సరాన్ని స్వాగతించిందరని పలువురు నెటిజనులు పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు షారూఖ్ భార్య గౌరీ కూడా ఇస్లాం మతంలోకి మారిందని కొందరు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో వెనుక అసలు నిజం బయటపడింది. నిజానికి మక్కాలో ఖాన్ కుటుంబం వైరల్ ఫోటో పూర్తిగా ఫేక్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఫోటో అని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.
బాలీవుడ్ లో సూపర్‌స్టార్ గా తనను తాను ఆవిష్కరించుకున్న షారుఖ్ ఖాన్ ముస్లిం అయితే, గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా సుప్రసిద్ధురాలు. గౌరీ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. ఈ జంట 1991లో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు - ఆర్యన్, సుహానా ఖాన్, అబ్రామ్ ఖాన్ ఉన్నారు. తమ ప్రేమ వివాహంలో ఏవైనా చిక్కులు ఉన్నాయా? అనే ప్రశ్నకు 2005లో `కాఫీ విత్ కరణ్`లో గౌరీ స్పష్ఠతనిచ్చారు. తామిద్దరం మతానికి అతీతంగా ఒకరికొకరు గౌరవించుకుంటామని గౌరీ తెలిపారు. నేను ముస్లిమ్ గా మారనవసరం లేదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వారి మతాన్ని అనుసరిస్తారు. పరస్పర గౌరవం అవసరం. షారూఖ్ నా మతాన్ని ఎప్పటికీ అగౌరవపరచడు.. నేను అతడిని అగౌరవపరచను... అని గౌరీఖాన్ తెలిపారు.
కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. షారుక్ ఖాన్ తదుపరి `కింగ్`లో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రను పోషిస్తుండగా, అభయ్ వర్మ ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కింగ్ చిత్రానికి వాస్తవంగా సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించాల్సి ఉండగా, ఇప్పుడు పఠాన్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ తేదీ ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.