జానీ మాస్టర్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు: 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి

సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ప్రస్తుతం లైంగిక దాడి ఆరోపణల కింద జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-25 08:28 GMT

సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ప్రస్తుతం లైంగిక దాడి ఆరోపణల కింద జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు జానీ మాస్టర్‌ను నాలుగు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. నార్సింగి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపి ఈ తీర్పును వెలువరించింది.

ఇందుకు పూర్వం నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి, జానీ మాస్టర్‌ను కస్టడీకి తీసుకోవాలని కోరారు. బాధితురాలు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, నాలుగు సంవత్సరాలుగా లైంగిక వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు గురయ్యానని ఆమె చెప్పడంతో, ఈ ఆరోపణలను పూర్తిగా పరిశీలించడానికి కస్టడీ అవసరమని పోలీసులు కోర్టుకు తెలిపారు.

మంగళవారం జరిగిన విచారణ తర్వాత కోర్టు తన తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ఇప్పుడు కోర్టు జానీ మాస్టర్‌ను నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకోవడానికి అనుమతిచ్చిన వెంటనే, పోలీసులు ఆయనను విచారణ ప్రారంభించనున్నారు. జానీ మాస్టర్‌పై ఉన్న ఈ కేసులో విచారణ మరింత సీరియస్ కావడంతో, ఇక్కడి నుంచి ఎటువంటి కీలక ఆధారాలు బయటకు వస్తాయన్నది వేచి చూడాల్సిందే.

గతంలో జానీ మాస్టర్‌ తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కింద సెక్షన్‌ 376, 354 మరియు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయడం జరిగింది. జానీ ఈ కేసులో పరారీలో ఉన్నప్పటికీ, సైబరాబాద్‌ పోలీసులు గోవా నుండి ఆయన్ను అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించారు. కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ను విధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం జానీ మాస్టర్‌ చర్లపల్లి జైలులో ఉన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో, పోలీసులు జానీ మాస్టర్‌ను కస్టడీకి తీసుకుని మరింత లోతైన విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విచారణతో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాలని ప్రముఖులు ఆశిస్తున్నారు. ఇక జానీ మాస్టర్‌ భవిష్యత్తు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News