సినిమా రిలీజైన వారం తర్వాత క్లైమాక్స్ చేంజ్
ఒక సినిమా రిలీజైన కొన్ని రోజులకు నిడివి ఎక్కువ అయిందని కొన్ని సన్నివేశాలు తొలగించడం మామూలే.;
ఒక సినిమా రిలీజైన కొన్ని రోజులకు నిడివి ఎక్కువ అయిందని కొన్ని సన్నివేశాలు తొలగించడం మామూలే. అలాగే సినిమా పట్ల జనాలను మరింత ఆకర్షించడానికి అదనపు సన్నివేశాలు లేదా పాట జోడించడం కూడా చాలాసార్లు జరిగింది. ఇటీవలే ‘పుష్ప-2’కు కూడా ఇలాగే ఎక్స్‌ట్రా సీన్స్ జోడించారు. ఐతే ఇప్పుడు ఓ సినిమాకు రిలీజైన వారం తర్వాత క్లైమాక్స్ మొత్తం మార్చేస్తుండడం విశేషం. ఆ చిత్రమే.. క్రేజీ. ‘తుంబాడ్’ ఫేమ్ సోహమ్ షా లీడ్ రోల్ చేసిన థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో లెజెండరీ నటుడు టిను ఆనంద్ ఓ కీలక పాత్ర చేశాడు. గిరీష్ కోహ్లి డైెరెక్ట్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లాస్ట్ వీకెండ్లో రిలీజైన ఈ మూవీ తొలి వారం మంచి వసూళ్లే సాధించింది. ఐతే ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో దాన్ని మార్చేస్తున్నారు మేకర్స్.
ఈ శుక్రవారం నుంచి ‘క్రేజీ’ మూవీ కొత్త క్లైమాక్స్‌తో ఆడబోతోంది. సినిమా మేకింగ్ దశలోనే దర్శకుడు రెండు క్లైమాక్సులు చిత్రీకరించాడట. అందులో మొదటిది పెట్టి సినిమా రిలీజ్ చేశారు. సినిమాకు పాజిటివ్ టాకే వచ్చినా.. క్లైమాక్స్ విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఆల్టర్నేట్ క్లైమాక్స్‌ను సినిమాలో జోడించాలని చిత్ర బృందం నిర్ణయించింది. మరి దీని విషయంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. గతంలో మహేష్ బాబు సినిమా ‘బాబీ’కి ట్రాజిక్ క్లైమాక్స్ పెట్టడం జనాలకు నచ్చలేదు. ఓవరాల్‌గా ఈ సినిమాకు డిజాస్టర్ టాకే వచ్చినప్పటికీ.. క్లైమాక్స్ వల్లే బ్యాడ్ టాక్ వచ్చిందనే ఉద్దేశంతో ఆ కథను సుఖాంతం చేస్తూ వేరే క్లైమాక్స్ జోడించారు కొన్ని రోజుల తర్వాత. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. సినిమా డిజాస్టరే అయింది. ఐతే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలో క్లైమాక్స్ మార్చి దాని రన్ ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు ‘క్రేజీ’ మేకర్స్. మరి ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో?