దళపతి 69 డీల్స్.. ఇదేమి డిమాండ్ సామీ
ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ఓవర్సీస్ రైట్స్ అమ్ముడైపోయాయి. ఫార్స్ ఫిలిమ్స్ 'దళపతి 69' ఓవర్సీస్ రైట్స్ ని ఏకంగా 78 కోట్లకి కొనుగోలు చేసింది.
ఇళయదళపతి విజయ్ హీరోగా చేయబోతున్న చివరి చిత్రం హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. 'దళపతి 69' వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. భారీ బడ్జెట్ తో కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకి సమయం కేటాయించనున్నారు. ఇప్పటికే తాను స్థాపించిన పార్టీ ద్వారా రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టాడు.
మరో రెండేళ్లలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'దళపతి 69' సినిమాని వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలని విజయ్ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే విజయ్ కి జోడీగా కన్ఫర్మ్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ఓవర్సీస్ రైట్స్ అమ్ముడైపోయాయి. ఫార్స్ ఫిలిమ్స్ 'దళపతి 69' ఓవర్సీస్ రైట్స్ ని ఏకంగా 78 కోట్లకి కొనుగోలు చేసింది.
కోలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ డీల్ ఈ సినిమాకి జరిగినట్లు తెలుస్తోంది. కనీసం సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రాలకి కూడా ఈ స్థాయిలో డీల్స్ జరగలేదు. దళపతి విజయ్ వరుస సక్సెస్ ల ట్రాక్ రికార్డ్ తో పాటు, ఆయన కెరియర్ లో చివరి చిత్రం కావడం వలన ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మూవీ బిజినెస్ డీల్స్ కూడా భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ లో దళపతి విజయ్ కి 300 కోట్లకి పైగా మార్కెట్ ఉంది. ఓ విధంగా చెప్పాలంటే సౌత్ లో ప్రభాస్ తర్వాత అత్యధిక మార్కెట్ ఉన్న హీరో విజయ్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఓవర్సీస్ లో 'దళపతి 69' సినిమాని ఎక్కువ ధరకి కొనుగోలు చేశారు. ఈ కలెక్షన్స్ ని అందుకోవాలంటే 20 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకోవాల్సి ఉంటుంది.
ఆ కలెక్షన్స్ ని 'దళపతి 69' మూవీ అందుకుంటే 'బాహుబలి 2' పేరు మీద ఉన్న రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూవీకి హిట్ టాక్ వస్తే 25 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కూడా ఓవర్సీస్ లో ఈ సినిమాకి వస్తాయని విజయ్ అభిమానులు అంటున్నారు. కోలీవుడ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమా 15 మిలియన్ డాలర్స్ ని కూడా ఓవర్సీస్ లో దాటలేదు. దళపతి 69 మూవీ 20 మిలియన్ డాలర్స్ క్రాస్ చేస్తే మాత్రం కచ్చితంగా రికార్డ్ అవుతుందని చెప్పొచ్చు.