పరప్పన్ జైలు నుంచి బళ్లారి జైలుకు దర్శన్ అండ్ కో!
కన్నడ నటుడు దర్శన్ కి పరప్పన్ అగ్రహారం జైలు అధికారులు సకలక సౌకర్యాలు ఏర్పాటు చేసిన తీరుతో అంతా షాక్ అయిన సంగతి తెలిసిందే.
కన్నడ నటుడు దర్శన్ కి పరప్పన్ అగ్రహారం జైలు అధికారులు సకలక సౌకర్యాలు ఏర్పాటు చేసిన తీరుతో అంతా షాక్ అయిన సంగతి తెలిసిందే. రౌడీ స్నేహితులతో కలిసి బయటకు వచ్చి ఛాయ్...సిగరెట్ తాగుతూ చిక్కిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో అసలు గుట్టు వీడిన సంగతి తెలిసిందే. బయటకు వెళ్లే వెసులుబాటు కల్పించారంటే? జైల్లో దర్శన్ కి ఇంకెలాంటి లోటు పాట్లు ఉండవని తేటతెల్లమైంది.
ఇది సంచలనమవ్వడంతో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దర్శన్ ని పరప్పన్ జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించారు. దర్శన్ సహా రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్న మిగతా 16 మందికి కూడా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం దర్శన్ సహా మిగతా 16 మంది జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా దర్శన్ అండ్ గ్యాంగ్ పై నెటి జనులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ్ నుంచి దర్శన్ అనునూయల్ని పక్కన బెడితే? నిజంగా తప్పు చేస్తే ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేని హెచ్చరించిన వర్గం అంతే బలంగా ఉంది.
దర్శన్ ని శిక్షించాలని డిమాండ్ చేసిన సెలబ్రిటీలు కొందరున్నారు. ఇప్పటికే సాక్షాలన్నీ దర్శన్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. రేణుకాస్వామి కిడ్నాప్ అయిన దగ్గర నుంచి హత్య వరకూ దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రా గౌడ్ వేలి ముద్రలు కూడా దొరికాయి. మిగతా ఆధారాలు ఆ ఇద్దరికీ వ్యతిరేకంగానే ఉన్నాయి. దీంతో ఈ కేసు విషయంలో దర్శన్ అండ్ కోకి శిక్ష తప్పదనే మెజార్టీ వర్గం భావిస్తోంది.