100 రోజులుగా జైల్లోనే దర్శన్ అండ్ కో!
దర్శన్ కి సకల సౌకర్యాలు పరప్పన్ అగ్రహారం జైలు అధికారులు కల్పించడంతో అతడిని బళ్లారి జైలుకు ఇటీవలే తరలించారు.
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ , అతడి ప్రియురాలు పవిత్రా గౌడ్, మరో 15 మంది కర్ణాటక జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. మూడు నెలలుగా వాళ్లంతా వివిధ జైల్లో ఉన్నారు. దర్శన్ కి సకల సౌకర్యాలు పరప్పన్ అగ్రహారం జైలు అధికారులు కల్పించడంతో అతడిని బళ్లారి జైలుకు ఇటీవలే తరలించారు. అక్కడ ఇలాంటి సౌకర్యాలకు అధికారులు ఛాన్స్ ఇవ్వరు.
రూల్స్ కఠినంగా ఉంటాయని అక్కడికి తరలించారు. తాజాగా అతడు జైలుకెళ్లి 100 రోజులు పూర్తయినట్లు తెలుస్తోంది. జూన్ 11న దర్శన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైసూర్ లోని హోటల్ రాడిసన్ లో జిమ్ చేస్తోన్న సమయంలో పోలీసులు ఆచూకీ తెలుసుకుని నేరుగా స్పాట్ కి చేరుకుని అరెస్ట్ చేసారు. అనంతరం పరప్పన్ అగ్రహారం జైలుకు తరలించారు. జూన్ 8న రేణుకాస్వామిని హత్య చేసినట్లు ఆరోపణ వచ్చింది.
ఆ వెంటనే మూడు రోజుల పాటు పోలీసులు సమాచారం.. పక్కా వివరాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ అరెస్ట్ తో ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. అంత పెద్ద హీరో హత్య కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటని? ముందు ఎవరూ నమ్మలేదు. ఆ తర్వాత ఒక్కో ఆధారం బయటకు రావడంతో దర్శన్ పై అనుమానాలు బలపడ్డాయి. ఈ కేసులో ఏ1గా పవిత్రా గౌడ్ ఉండగా, ఏ2గా దర్శన్ ఉన్నాడు.
ఇద్దరు కొన్ని రోజుల పాటు పరప్పన్ అగ్రహారం జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత దర్శన్ ని బళ్లారి జైలుకు తరలించారు. ఇంకా మరో 15 మంది అదే జైల్లో ఉన్నారు. వీళ్లంతా హత్యకు సహకరించిన వారిగా ఉన్నారు. రేణుకాస్వామిని చిత్రం హింసలకు గురి చేసి చంపినట్లు పోలీసులు వద్ద ఆధారాలున్నాయి. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది.