జైల్లో ఉన్నా అత‌డి క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లే!

దీంతో ద‌ర్శ‌న్ ఏ రేంజ్ స్టార్ అన్న‌ది మరోసారి దేశ వ్యాప్తంగా ఆ స‌క్తిక‌రంగా మారింది.

Update: 2024-07-18 11:30 GMT

జైల్లో ఉన్నా శాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. తాజాగా ఆర్మాక్స్ మీడియా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన తార‌ల లిస్ట్ ని ప్ర‌క‌టించింది. ఇదులో ద‌ర్శన్ కి మూడ‌వ స్థానం ద‌క్కింది. మొద‌టి స్థానంలో కేజీఎఫ్ స్టార్ య‌శ్ ఉండ‌గా, రెండ‌వ స్థానంలో సుదుప్ నిలిచాడు. ఇలా శాండిల్ వుడ్ లో ముగ్గురు టాప్ -3 లో నిలిచారు. దీంతో ద‌ర్శ‌న్ ఏ రేంజ్ స్టార్ అన్న‌ది మరోసారి దేశ వ్యాప్తంగా ఆ స‌క్తిక‌రంగా మారింది.

జైల్లో ఉన్నా అత‌డి క్రేజ్ ఏమాత్రం తగ్గ‌లేద‌ని..భారీ ఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్ గా నిలిచాడు. అదే అభిమాని రేణుక్వాస్వామిని హ‌త్య చేసిన కేసులో ద‌ర్శ‌న్ నిందితుడ‌గా ఉన్న‌సంగ‌తి తెలిసిందే. ఏ1గా ప‌విత్రా గాడ్ ఉండ‌గా..ఏ2గా ద‌ర్శ‌న్ ఉన్నాడు. ప్ర‌స్తుతం ప‌ర‌ప్ప‌న్ అగ్ర‌హారం జైలులో ఉన్నాడు. నేటితో జ్యూడీష‌ల్ కస్ట‌డీ కూడా ముగుస్తుంది. పోలీసులు క‌స్ట‌డీకి అడిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే ఈ కేసులో పోలీసులు కీల‌క సాక్ష్యాలు సంపాదించారు. వాటిని నేడు కోర్టులో ప్ర‌వేశ పెడ‌తారు. వాటి ఆధారంగా ద‌ర్శ‌న్ కి త‌దుప‌రి క‌స్ట‌డీ అధార‌ప‌డి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి ద‌ర్శ‌న్ కి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అత‌డి స్నేహితులు ..కొంత మంది స్టార్లు, సుమ‌ల‌త వంటి వారు ద‌ర్శ‌న్ త‌ప్పు చేసి ఉండ‌డ‌ని..త‌ప్ప‌కుండా నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తాడని ధీమా వ్య‌క్తం చేసారు.

మ‌రోవైపు ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌ల‌క్ష్మి బెయిల్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ సాక్ష్యులు బ‌లంగా ఉండ‌టంతో బెయిల్ దొర‌క‌డం లేదు. నేటి విచార‌ణ అన‌త‌రం మ‌రిన్ని అప్ డేట్స్ తెలిసే అవ‌కాశం ఉంది. ద‌ర్శ‌న్ అరెస్ట్ తో అత‌డి సినిమాల‌న్నీ ఎక్క‌డివి అక్క‌డ నిలిచిపోయాయి. అలాగే అడ్వాన్స్ తీసుకుని సైన్ చేయ‌ని ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయ‌ని వెలుగులోకి వ‌స్తోంది.

Tags:    

Similar News